Education-Article
వీఆర్‌ఏల రాస్తారోకో
కాగజ్‌నగర్‌లో రాస్తారోకో చేస్తున్న వీఆర్‌ఏలు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 8: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్క రించాలని నిరవధిక సమ్మె చేపడుతున్న వీఆర్‌ఏలు నిరసనల్లో భాగంగా శనివారం పట్టణంలోని అంబేద్కర్‌చౌక్‌లో రాస్తారోకో చేశారు. వీరికి బీజేపీ, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. తమ  సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం నాయకులు వినోద్‌, కేదారి, బీజేపీ నాయకులు ఖాండ్రే విశాల్‌, ఆత్మరాం నాయక్‌, గణేశ్‌, సీఐటీయూ నాయకులు లోకేష్‌, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

కాగజ్‌నగర్‌: పట్టణంలో వీఆర్‌ఎల ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్‌ చౌక్‌ వద్ద శనివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ ఛైర్మన్‌ నారాయణ, జిల్లా కో ఛైర్మన్‌ విజయ్‌ మాట్లాడుతూ 76 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు దీక్షలు చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం  స్పందించడం లేదన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమ సమస్యలపై అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత కూడా ఇంత వరకు  ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. రాస్తారోకో డివిజన్‌లోని వీఆర్‌ఏలు పాల్గొన్నారు. 

Tags :