Education-Article
BELలో 141 ఇంజనీర్లు

హైదరాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ట్రెయినీ ఇంజనీర్లు-89, ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు-52

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌ తదితరాలు

అర్హత:

ట్రెయినీ ఇంజనీర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత

వయసు: 28 ఏళ్లు మించకూడదు

పని అనుభవం: కనీసం 6 నెలల పని అనుభవం ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.30,000-రూ.40,000 చెల్లిస్తారు

ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత.

వయసు: 32 ఏళ్లు మించకూడదు

పని అనుభవం: కనీసం 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.40,000 నుంచి రూ.55,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: రాత పరీక్ష, వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 14

రాత పరీక్ష తేదీ: అక్టోబరు 16

వాక్‌ ఇన్‌ వేదిక: లిటిల్‌ ఫ్లవర్‌ జూనియర్‌ కాలేజ్‌, అపోజిట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, పీఅండ్‌టి కాలనీ, ఉప్పల్‌, హైదరాబాద్‌-500039

వెబ్‌సైట్‌: https://www.belindia.in/

Tags :