Education-Article
Hyderabad IITలో పీహెచ్‌డీ

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీహెచ్‌) - పీహెచ్‌డీ 2023 జనవరి సెషన్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెగ్యులర్‌, ఎక్స్‌టర్నల్‌(పార్ట్‌ టైం) విధానాలు అందుబాటులో ఉన్నాయి. ప్రోగ్రామ్‌ వ్యవధి అయిదేళ్ల వరకూ ఉంటుంది.  స్పెషలైజేషన్‌ను అనుసరించి అకడమిక్‌ ప్రతిభ, రిటెన్‌ టెస్ట్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు.  

స్పెషలైజేషన్‌లు: ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌, బయోటెక్నాలజీ, క్లయిమేట్‌ ఛేంజ్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, డిజైన్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, లిబరల్‌ ఆర్ట్స్‌, మేథమెటిక్స్‌, మెటీరియల్స్‌ సైన్స్‌ అండ్‌ మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ అండ్‌ ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌, ఫిజిక్స్‌, హెరిటేజ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

అర్హత: సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగాలు లేదా సైన్స్‌ సబ్జెక్ట్‌లతో ఎంఈ/ ఎంటెక్‌/ఎండిజైన్‌/ ఎంఆర్క్‌/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణులు; ఎంసీఏ/ ఎంఎస్‌(ఇంజనీరింగ్‌/ టెక్నాలజీ)/ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌/ బీఈ/ బీటెక్‌ పూర్తిచేసినవారు  దరఖాస్తు చేసుకోవచ్చు. 


  • సీఎస్‌ఐఆర్‌ నెట్‌ జేఆర్‌ఎఫ్‌/ యూజీసీ నెట్‌ జేఆర్‌ఎఫ్‌/ ఐసీఎంఆర్‌ జేఆర్‌ఎఫ్‌/ డీబీటీ జేఆర్‌ఎఫ్‌/ సీడ్‌ స్కోర్‌/ గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ తప్పనిసరి. 
  • సీఎఫ్‌టీఐ సంస్థల నుంచి కనీసం 8 సీజీపీఏతో బీఈ/ బీటెక్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు గేట్‌ స్కోర్‌ అవసరం లేదు.


ముఖ్య సమాచారం

రెగ్యులర్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500; మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250

ఎక్స్‌టర్నల్‌ (పార్ట్‌ టైం) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తు ఫీజు: అభ్యర్థులందరూ రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 14

వెబ్‌సైట్‌: iith.ac.in 

Tags :