Education-Article
Panchakarma టెక్నీషియన్‌ కోర్సు

భారత ఆయుష్‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌(సీసీఆర్‌ఏఎస్‌)- పంచకర్మ టెక్నీషియన్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగించింది. ఇది ఏడాది వ్యవధి గల సెల్ఫ్‌ ఫైనాన్స్‌డ్‌ రెగ్యులర్‌ నాన్‌ రెసిడెన్షియల్‌ కోర్సు. హెల్త్‌కేర్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌(హెచ్‌ఎ్‌సఎ్‌ససీ) - నేషనల్‌ స్కిల్స్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌డీసీ)కి అనుబంధంగా ఉన్న ట్రెయినింగ్‌ సెంటర్లలో శిక్షణ ఇస్తారు. ప్రతి రోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు థియరీ తరగతులు, ప్రాక్టికల్‌ సెషన్స్‌ నిర్వహిస్తారు. హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో బోధన ఉంటుంది. అవసరం మేరకు ప్రాంతీయ భాషల్లో వివరణ ఇస్తారు. కనీసం 75 శాతం అటెండెన్స్‌ తప్పనిసరి. నిబంధనల ప్రకారం కోర్సు పూర్తిచేసినవారికి సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తారు. శిక్షణ సమయంలో ఇతర కోర్సుల్లో చేరేందుకు అనుమతించరు. అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  


ట్రెయినింగ్‌ సెంటర్లు - సీట్లు: సెంట్రల్‌ ఆయుర్వేద రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఏఆర్‌ఐ)కి సంబంధించి న్యూఢిల్లీ, గువహటి సెంటర్లలో ఒక్కోదానిలో 10 సీట్లు; కేరళ - చెరుతురుతిలోని నేషనల్‌ ఆయుర్వేద రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పంచకర్మ (ఎన్‌ఏఆర్‌ఐపీ)లో 30 సీట్లు; జమ్ములోని రీజనల్‌ ఆయుర్వేద రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌ఏఆర్‌ఐ)లో 15 సీట్లు ఉన్నాయి. ప్రతి సెంటర్లో సగం సీట్లను మహిళలకు ప్రత్యేకించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఎంచుకొన్న సెంటర్‌కు దరఖాస్తు పంపుకోవాలి. సెంటర్ల చిరునామాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. 

అర్హత: దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రెయినింగ్‌ పూర్తయ్యేనాటికి అభ్యర్థులకు 18 ఏళ్లు నిండాలి.


ముఖ్య సమాచారం

కోర్సు ఫీజు: రూ.30,000 

దరఖాస్తు ఫీజు: రూ.500

రిజిస్టర్డ్‌/ స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: అక్టోబరు 10

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: అక్టోబరు 17

కోర్సు ప్రారంభం: అక్టోబరు 27 నుంచి

వెబ్‌సైట్‌: ccras.nic.in

Tags :