Education-Article
కాళోజీ హెల్త్‌ వర్సిటీలో పారామెడికల్‌ డిగ్రీలు

వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌) - పారామెడికల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ, పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్‌ ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. బీపీటీ ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగున్నరేళ్లు. ఇందులో ఆర్నెల్ల ఇంటర్న్‌షిప్‌ కూడా ఉంటుంది. పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ అనుబంధ కళాశాలల్లో కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్లు భర్తీ చేయనున్నారు. డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌, కౌన్సెలింగ్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


అర్హత: బీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లీష్‌ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్‌/ పన్నెండోతరగతి / తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు; ఇంటర్‌తోపాటు బయాలజీ, ఫిజికల్‌ సైన్సెస్‌లో బ్రిడ్జ్‌ కోర్సు చేసినవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. కనీసం 45 శాతం మార్కులు తప్పనిసరి. బీపీటీ ప్రోగ్రామ్‌నకు ఇంటర్‌ ఒకేషనల్‌(ఫిజియోథెరపీ) కోర్సు ఉత్తీర్ణులు కూడా అర్హులే. డిసెంబరు 31 నాటికి అభ్యర్థుల వయసు 17 ఏళ్లు నిండి ఉండాలి. పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రోగ్రామ్‌నకు ఏదేని గ్రూప్‌తో ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు; జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ కోర్సు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. 


  • పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రోగ్రామ్‌నకు సంబంధించి ప్రభుత్వ కళాశాలల్లో మహిళలకు మాత్రమే అడ్మిషన్స్‌ ఇస్తారు. వీరికి ప్రభుత్వ ఆసుపత్రులలో కనీసం రెండేళ్లు నర్సుగా పనిచేసిన అనుభవం ఉండాలి.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.2500; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 3

వెబ్‌సైట్‌: https://tsparamed.tsche.in, www.knruhs.telangana.gov.in

Tags :