Education-Article
Kakatiya Universityలో డిస్టెన్స్‌ కోర్సులు

వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ(Warangal Kakatiya University) (కేయూ) ఆధ్వర్యంలోని ‘స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ అండ్‌ కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్‌డీఎల్‌సీఈ)’ - డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిని సెమిస్టర్ల ప్రకారం దూరవిద్య విధానంలో నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ సెషన్స్‌ ద్వారా బోధన ఉంటుంది. ధృవపత్రాల పరిశీలన ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. పీజీ కోర్సులను గరిష్ఠంగా ఆరేళ్లలో, డిగ్రీ కోర్సులను తొమ్మిదేళ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. వయోపరిమితి నిబంధనలు లేవు.  


డిగ్రీ కోర్సులు: బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ ప్రోగ్రాములు ఉన్నాయి. ఒక్కో కోర్సు వ్యవధి మూడేళ్లు. ఇందులో ఆరు సెమిస్టర్లు ఉంటాయి. బీఎస్సీకి మేథ్స్‌/ స్టాటిస్టిక్స్‌ / కంప్యూటర్స్‌ ఒక సబ్జెక్ట్‌గా ఇంటర్‌ / పన్నెండోతరగతి ఉత్తీర్ణులైనవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. మిగిలిన కోర్సులకు ఏ గ్రూప్‌ అభ్యర్థులైనా అర్హులే. బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. ఇందులో రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీకాం(కంప్యూటర్స్‌), బీబీఏ, బీఎల్‌ఐఎస్సీ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే చదవాలి. మిగిలిన వాటికి తెలుగు/ ఆంగ్ల మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు.


బీఏ గ్రూప్‌లు: హెచ్‌పీపీ, ఈపీపీ, ఎస్‌పీపీ

బీకాం గ్రూప్‌లు: జనరల్‌, కంప్యూటర్స్‌

బీఎస్సీ సబ్జెక్ట్‌లు: మేథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌


పీజీ కోర్సులు: ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఎస్‌డబ్ల్యు, ఎంటీఎం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఎమ్మెస్సీకి స్పెషలైజేషన్‌ను అనుసరించి సైన్స్‌ డిగ్రీ/ బీఏ(మేథ్స్‌)/ బీఎస్సీ(ఎంపీసీ); మిగిలినకోర్సులకు ఏదేని డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.  లాంగ్వేజెస్‌లో ఎంఏ ప్రవేశానికి సంబంధిత లాంగ్వేజ్‌ ఒక సబ్జెక్ట్‌గా డిగ్రీ చదివి ఉండాలి.  మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ వ్యవధి ఏడాది. ఇందులో రెండు సెమిస్టర్లు ఉంటాయి. బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. మాస్టర్‌ ఆఫ్‌ జర్నలిజం వ్యవధి ఏడాది. ఇందులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. బీసీజే అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు. 

ఎంఏ స్పెషలైజేషన్‌లు: తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, సంస్కృతం, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ, రూరల్‌ డెవల్‌పమెంట్‌, సోషియాలజీ, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ 

ఎమ్మెస్సీ స్పెషలైజేషన్‌లు: మేథ్స్‌, సైకాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.400; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 10

వెబ్‌సైట్‌: sdlceku.co.in

Tags :