Education-Article
SCTIMSTలో అకడమిక్‌ ప్రోగ్రామ్‌లు

త్రివేండ్రంలోని శ్రీ చిత్ర తిరునల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ (ఎస్‌సీటీఐఎంఎస్‌టీ) - డిప్లొమా, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. 


డిప్లొమా: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ఆపరేషన్‌ థియేటర్‌ అండ్‌ అనెస్తీషియా టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్‌ మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, కార్డియోవాస్కులర్‌ అండ్‌ థొరాసిక్‌ నర్సింగ్‌, న్యూరో నర్సింగ్‌ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి.

అర్హత: ఆపరేషన్‌ థియేటర్‌కు డిప్లొమా(ఎలకా్ట్రనిక్స్‌ / బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ / ఇన్‌స్ట్రుమెంటేషన్‌); ఇమేజింగ్‌ టెక్నాలజీకి రెండేళ్ల సీఆర్‌ఏ/ డీఆర్‌టీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. నర్సింగ్‌ విభాగాలకు జీఎన్‌ఎం కోర్సు ఉత్తీర్ణతతోపాటు డిసెంబరు 31 నాటికి ఏడాది అనుభవం ఉండాలి. బీఎస్సీ(నర్సింగ్‌) అభ్యర్థులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు తప్పనిసరి.

పీజీ డిప్లొమా: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. కార్డియాక్‌ ల్యాబరేటరీ టెక్నాలజీ, న్యూరో టెక్నాలజీ, మెడికల్‌ రికార్డ్స్‌ సైన్స్‌, క్లినికల్‌ పెర్ఫ్యూజన్‌, బ్లడ్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. 

అర్హత: స్పెషలైజేషన్‌ను అనుసరించి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జువాలజీ, బయలాజికల్‌ సైన్సెస్‌, బయోటెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. అభ్యర్థుల వయసు ప్రోగ్రామ్‌ ప్రారంభం నాటికి 25 ఏళ్లు మించకూడదు.

పీహెచ్‌డీ: ఏడాదికి రెండుసార్లు  ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తారు. హెల్త్‌ సైన్సెస్‌ విభాగంలో పార్ట్‌ టైం ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది. అభ్యర్థులు దరఖాస్తుతోపాటు కనీసం వెయ్యి పదాలతో రీసెర్చ్‌ ప్రపోజల్‌, కనీసం 300 పదాలతో స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ అప్‌లోడ్‌ చేయాలి.

స్పెషలైజేషన్‌లు: ఫిజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, బయలాజికల్‌ సైన్సెస్‌, బయో ఇంజనీరింగ్‌, బయోమెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మెడికల్‌ సైన్సెస్‌, హెల్త్‌ సైన్సెస్‌.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: డిప్లొమా, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లకు రూ.800; పీహెచ్‌డీకీ రూ.1500

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 30

వెబ్‌సైట్‌: www.sctimst.ac.in

Tags :