Education-Article
బేగం హజ్రత్‌మహల్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌

 ఢిల్లీలోని మౌలానా ఆజాద్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ - ‘బేగం హజ్రత్‌మహల్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మైనారిటీ వర్గాల్లోని పేదింటి బాలికలను ఉన్నత విద్యలో ప్రోత్సహించేందుకు దీనిని ఉద్దేశించారు. అకడమిక్‌ ప్రతిభ, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. విద్యార్థినులు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అర్హత: ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ద, జైన, పార్సీ మతాలకు చెందిన బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. తొమ్మిది, పది, ఇంటర్‌(ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు), పదకొండు, పన్నెండు తరగతులు చదువుతున్నవారు అర్హులు. కిందటి తరగతిలో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏదేని స్కాలర్‌షిప్‌ పొందినవారు దరఖాస్తుకు అనర్హులు.

స్కాలర్‌షిప్‌: తొమ్మిదోతరగతి, పదోతరగతి చదువుతున్నవారికి నెలకు రూ.5,000;  పదకొండోతరగతి, పన్నెండోతరగతి చదువుతున్నవారికి నెలకు రూ.6,000 ఇస్తారు. ప్రతినెలా విద్యార్థిని బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తారు. స్కూల్‌/ కాలేజ్‌ ఫీజు, పాఠ్య పుస్తకాల కొనుగోలు, స్టేషనరీ, వసతి ఖర్చుల నిమిత్తం ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. మధ్యలో చదువు ఆపేస్తే వారి స్కాలర్‌షిప్‌ రద్దవుతుంది. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు లేదు   

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 30

ఇన్‌స్టిట్యూట్‌ వెరిఫికేషన్‌: అక్టోబరు 16 వరకు

వెబ్‌సైట్‌: scholarships.gov.in, maef.nic.in/scholarshipscheme

Tags :