Education-Article
UPSC కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌

మొత్తం ఖాళీలు 285


యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ‘కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డ్‌లో కేటగిరీ-1, కేటగిరీ-2 పోస్టులను భర్తీ చేస్తారు.


ఖాళీల వివరాలు

కేటగిరీ-1: జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, గనుల మంత్రిత్వశాఖ.

జియాలజిస్ట్‌, గ్రూప్‌-ఎ: 216 పోస్టులు

జియోఫిజిసిస్ట్‌, గ్రూప్‌-ఎ: 21 పోస్టులు

కెమిస్ట్‌, గ్రూప్‌-ఎ: 19 పోస్టులు

కేటగిరీ-2: సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌బోర్డ్‌, జలశక్తి మంత్రిత్వశాఖ, జలనవరుల శాఖ

సైంటిస్ట్‌ ‘బి’(హైడ్రోజియాలజీ), గ్రూప్‌-ఎ: 26 పోస్టులు

సైంటిస్ట్‌ ‘బి’(కెమికల్‌), గ్రూప్‌-ఎ: 01 పోస్టు

సైంటిస్ట్‌ ‘బి’(జియోఫిజిక్స్‌) గ్రూప్‌-ఎ: 02


అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ(జియోలాజికల్‌ సైన్స్‌/జియాలజీ/అప్లయిడ్‌ జియాలజీ/జియో ఎక్స్‌ప్లోరేషన్‌/మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌/ఇంజనీరింగ్‌ అప్లయిడ్‌ జియోఫిజిక్స్‌/మెరైన్‌ జియో ఫిజిక్స్‌/అప్లయిడ్‌ జియోఫిజిక్స్‌/కెమిస్ట్రీ/అప్లయిడ్‌ కెమిస్ట్రీ/అనలిటికల్‌ కెమిస్ట్రీ/హైడ్రోజియాలజీ), ఎమ్మెస్సీ(టెక్‌)- అప్లయిడ్‌ జియోఫిజిక్స్‌.

వయోపరిమితి: 2023 జనవరి 1 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి

దరఖాస్తు రుసుము: రూ.200. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులకు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది.

పరీక్ష విధానం: స్టేజ్‌-1 కంబైన్డ్‌ జియో - సైంటిస్ట్ (ప్రిలిమినరీ) పరీక్ష(ఆబ్జెక్టివ్‌ టైప్‌), స్టేజ్‌-2 కంబైన్డ్‌ జియో - సైంటిస్ట్(మెయిన్‌) ఎగ్జామినేషన్‌(డిస్ర్కిప్టివ్‌ టైప్‌), స్టేజ్‌-3 పర్సనాలిటీ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఉంటుంది.

ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, భోపాల్‌, చండీగఢ్‌, చెన్నై, కటక్‌, ఢిల్లీ, దిస్‌పూర్‌, జైపూర్‌, జమ్మూ, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్‌(అలహాబాద్‌), షిల్లాంగ్‌, సిమ్లా, తిరువనంతపురం.             

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 10

దరఖాస్తుల ఉపసంహరణ తేదీలు: అక్టోబరు 19 నుంచి 25 వరకు

ప్రిలిమినరీ పరీక్ష: 2023 ఫిబ్రవరి 19

మెయిన్‌ పరీక్ష తేదీలు: 2023 జూన్‌ 24, 25

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/

Tags :