Education-Article
నేషనల్‌ ఆర్కైవ్స్‌లో సర్టిఫికెట్‌ కోర్సులు

నేషనల్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని స్కూల్‌ ఆఫ్‌ ఆర్కైవల్‌ స్టడీస్‌ - షార్ట్‌ టర్మ్‌ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ రెప్రోగ్రఫీ: ఈ కోర్సుని నవంబరు 7 నుంచి డిసెంబరు 16 వరకు నిర్వహిస్తారు. ఇందులో రీ ప్రొడక్షన్‌ ఆఫ్‌ డాక్యుమెంట్స్‌ అండ్‌ మాన్యుస్ర్కిప్ట్స్‌, మైక్రోఫిల్మింగ్‌, ఆటొమేటెడ్‌ ఇన్ఫర్మేషన్‌ స్టోరేజ్‌, రిట్రైవల్‌ అండ్‌ డిసెమినేషన్‌ సంబంధిత అంశాలు వివరిస్తారు.

సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ కేర్‌ అండ్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ బుక్స్‌ - మాన్యుస్ర్కిప్ట్స్‌ - ఆర్కైవ్స్‌: ఈ కోర్సుని అక్టోబరు 31 నుంచి డిసెంబరు 23 వరకు నిర్వహిస్తారు. ఇందులో సైంటిఫిక్‌ మెథడ్స్‌ ఆఫ్‌ కన్జర్వేషన్‌, రిపైర్‌, రీహాబిలిటేషన్‌, స్టోరేజ్‌ అండ్‌ హ్యాండిలింగ్‌ ఆఫ్‌ డాక్యుమెంటరీ హెరిటేజ్‌ సంబంధిత అంశాలు వివరిస్తారు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు. సైన్స్‌ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ప్రైవేట్‌ అభ్యర్థులకు 30, స్పాన్సర్డ్‌ అభ్యర్థులకు 50 ఏళ్లలోపు వయసు ఉండాలి. 


ముఖ్య సమాచారం

కోర్సు ఫీజు: రూ.300

దరఖాస్తు ఫీజు: రూ.100 

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: కేర్‌ అండ్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ బుక్స్‌-మాన్యుస్ర్కిప్ట్స్‌ - ఆర్కైవ్స్‌ కోర్సుకు అక్టోబరు 7; రెప్రోగ్రఫీ కోర్సుకు అక్టోబరు 15

దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: ఎడ్యుకేషనల్‌ సర్టిఫికెట్‌లు; కులం, స్పాన్సర్‌షిప్‌ ధ్రువీకరణ పత్రాలు

చిరునామా: డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఆర్కైవ్స్‌, నేషనల్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియా, జన్‌పథ్‌, న్యూఢిల్లీ - 110001

వెబ్‌సైట్‌: nationalarchives.nic.in

Tags :