Education-Article
Central Bankలో 110 స్పెషలిస్ట్‌ కేటగిరీ ఉద్యోగాలు

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(centralbankofindia)... దేశవాప్తంగా ఉన్న శాఖల్లో వివిధ స్పెషలిస్ట్‌ కేటగిరీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


  • ఐటీ: 33 పోస్టులు
  • ఎకనామిస్ట్‌: 3 పోస్టులు
  • డేటా సైంటిస్ట్‌: 1 పోస్టు
  • రిస్క్‌ మేనేజర్‌: 21 పోస్టులు
  • ఐటీ ఎస్‌ఓసీ అనలిస్ట్‌: 1 పోస్టు
  • ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్‌: 1 పోస్టు
  • టెక్నికల్‌ ఆఫీసర్‌(క్రెడిట్‌): 15 పోస్టులు
  • క్రెడిట్‌ ఆఫీసర్‌: 8 పోస్టులు
  • డేటా ఇంజనీర్‌: 9 పోస్టులు
  • లా ఆఫీసర్‌: 5 పోస్టులు
  • సెక్యూరిటీ: 5 పోస్టులు
  • ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌: 8 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో సీఏ,  సీఎఫ్‌ఏ, ఏసీఎంఏ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు రుసుము: రూ.850, జీఎస్‌టీ(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175 జీఎస్‌టీ)

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: అక్టోబరు 17

ఇంటర్వ్యూ తేదీ: 2022 డిసెంబరు

వెబ్‌సైట్‌: www.centralbankofindia.co.in/ 

Tags :