Education-Article
గ్రూప్‌-1 పోస్టులకే ఇంటర్వ్యూలు

అమరావతి: నియామకాల్లో ఇంటర్వ్యూల పునరుద్ధరణ కేవలం గ్రూప్‌-1 పోస్టులకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రూప్‌-1, దానికి సమాన పోస్టులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు ఇంటర్వ్యూలు ఉంటాయని బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా వాటిని సవరిస్తూ ఇంటర్వ్యూలు కేవలం గ్రూప్‌-1 పోస్టులకు మాత్రమే ఉంటాయని పేర్కొంటూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :