Education-Article
విదేశీ విద్య దరఖాస్తుకు మరో నెల పొడిగింపు

అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిన విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువును మరో నెల పొడిగించారు. విద్యార్థులు సెప్టెంబరు 30 లోపు జ్ఞానభూమి వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కాగా, క్యూఎస్‌ ర్యాంకింగ్‌ 200లోపు ఉన్న వారికే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండటంతో ఎక్కువమంది ఈ ప్రయోజనం పొందలేకపోతున్నారు. అప్లికేషన్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్లు సమాచారం. విద్యాసంవత్సరం ప్రారంభమవ్వడంతో ఇప్పటికే విద్యార్థులు విదేశాలకు చదువులకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఒకటిన్నర నెలకు పైగా దరఖాస్తు చేసుకునేందుకు ముందుకురాని అభ్యర్థులు ఇప్పుడు ఎలా వస్తారని, ప్రభుత్వం కాలయాపన కోసం ఈ గడువు పెంచిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :