Education-Article
Ambedkar University ప్రవేశాల గడువు పెంపు

హైదరాబాద్: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం(Dr. BR Ambedkar Universal University) డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ (ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ, బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ, పీజీ డొప్లొమా, పలు సర్టిఫికెట్‌) కోర్సుల్లో చేరడానికి చివరి తేదీ అక్టోబరు 15 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయం అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయా కోర్సుల్లో చేరేందుకు విద్యార్హతలు, ఫీజు వివరాలను సమీప అధ్యయన కేంద్రం ద్వారా తెలుసుకోవచ్చని, www.braouonline.in లోనూ వివరాలున్నట్టు తెలిపారు. ఇతర వివరాలకు 7382929570/580/590/600, విశ్వవిద్యాలయం 040-23680290/291/294/295 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

Tags :