Education-Article
జ్యోతి బాపూలే గురుకులాల్లో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్: రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లోని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల్లో డిగ్రీ ప్రవేశాల(Degree admissions)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆయా జిల్లాల్లోని కళాశాలల్లో తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని, అక్టోబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌ జిల్లాలోని కాలేజీలో అమ్మాయిలకు బీఎస్సీ-ఏఐఎంఎల్‌, ఎంఎస్‌డీఎస్‌, ఎంఎస్‌సీఎస్‌, ఎన్‌జెడ్‌సీ, డీటీహెచ్‌, బీబీఏ (బిజినెస్‌ అడ్మినిస్ర్టేషన్‌), బీకాం (కంప్యూటర్‌ అప్లికేషన్‌) కోర్సులు ఉన్నాయన్నారు. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు కాలేజీలో అబ్బాయిలకు బీఎస్సీ-ఏఐఎంల్‌, ఎంజీసీఎస్‌, ఎంఎస్‌డీఎస్‌, ఎంఎస్‌సీఎస్‌, బీజెడ్‌సీ, బీజెడ్‌జీ, బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, బీఏ-హిస్టరీ, ఎకనామిక్స్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ కోర్సులున్నాయన్నారు. కాగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో అమ్మాయిలకు బీఎస్సీ (ఎంపీసీ), ఎంపీసీఎస్‌, ఎంపీజీ, ఎంబీజెడ్‌సీ, బీకాం (సీఏ), బీకాం (బీఏ), బీఏ (హెచ్‌పీపీపీజీ), బీఏ (ఎస్‌పీపీ) కోర్సులున్నాయని వెల్లడించారు. 

Tags :