Education-Article
NLSలో లీగల్‌ కోర్సులు

బెంగళూరు(Bangalore)లోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ(National Law School of India University)(ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ) - మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ లాస్‌ (ఎంబీఎల్‌), పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. వీటిని ప్రొఫెషనల్‌ అండ్‌ కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌ (పీఏసీఈ) కింద బ్లెండెడ్‌ లెర్నింగ్‌ ఫార్మాట్‌లో నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ సెషన్స్‌, హైబ్రిడ్‌ ప్రోగ్రామ్స్‌ ఉంటాయి.


మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ లాస్‌ (ఎంబీఎల్‌): ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ఇందులో పది కోర్సులు ఉంటాయి. మొదటి ఏడాది కాంట్రాక్ట్‌ లా, బ్యాంకింగ్‌ లా, కార్పొరేట్‌ లా, ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌ లా, ఎన్విరాన్‌మెంటల్‌ లా కోర్సులు; రెండో ఏడాది ఇన్వె్‌స్టమెంట్‌ లాస్‌, ఇన్సూరెన్స్‌ లాస్‌, ఇంటర్నేషనల్‌ కమర్షియల్‌ ట్రాన్స్‌యాక్షన్స్‌ అండ్‌ ఫారిన్‌ ట్రేడ్‌, ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ లాస్‌, టాక్సెస్‌ ఆన్‌ కార్పొరేషన్స్‌  కోర్సులు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌ పూర్తిచేసిన అభ్యర్థులు లా ఆఫీసర్‌, లీగల్‌ అసిస్టెంట్‌, లీగల్‌ అడ్వైజర్‌గా రాణించవచ్చు.

పీజీ డిప్లొమా: ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. ఇందులో హ్యూమన్‌ రైట్స్‌ లా, మెడికల్‌ లా అండ్‌ ఎథిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ లా, ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ లా, చైల్డ్‌ రైట్స్‌ లా, కన్జూమర్‌ లా అండ్‌ ప్రాక్టీస్‌, సైబర్‌ లా అండ్‌ సైబర్‌ ఫోరెన్సిక్స్‌ స్పెషలైజేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. స్పెషలైజేషన్‌ను అనుసరించి ఈ ప్రోగ్రామ్‌ జర్నలి్‌స్టలు, అడ్వకేట్‌లు, రైట్స్‌ యాక్టివి్‌స్టలు, డాక్టర్‌లు, నర్స్‌లు, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్‌లు, హెల్త్‌ వర్కర్‌లు, ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొఫెషనల్స్‌, ఎన్‌జీఓలు, లీగల్‌ - ఎడ్యుకేషనల్‌ - రిసెర్చ్‌ విభాగాలకు చెందిన ప్రొఫెషనల్స్‌కు ఉపయుక్తంగా ఉంటుంది.  

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. సీఏ, సీఎస్‌, ఐసీడబ్ల్యూఏఐ కోర్సులు పూర్తిచేసినవారు; ఓపెన్‌ యూనివర్సిటీలలో చదివినవారు; డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా డిగ్రీలు పొందిన వారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. వయోపరిమితి నిబంధనలు లేవు. 

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: అక్టోబరు 15 

వెబ్‌సైట్‌: https://pace.nls.ac.in/

Tags :