Education-Article
నిక్మర్‌లో ఎంబీఏ, పీజీ డిప్లొమా

హైదరాబాద్‌(Hyderabad)లోని నిక్మర్‌ యూనివర్సిటీ(Nikmer University) - ఫుల్‌ టైం ఎంబీఏ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంబీఏ ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. పీజీ డిప్లొమా వ్యవధి ఏడాది. పీజీ- నిక్మర్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (పీజీ - ఎన్‌సీఏటీ), గ్రూప్‌ డిస్కషన్స్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, రేటింగ్‌ ఆఫ్‌ అప్లికేషన్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. 


ఎంబీఏ స్పెషలైజేషన్‌లు: అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌, లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లయ్‌ చెయిన్‌  మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌, సస్టయినబుల్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌

పీజీ డిప్లొమా స్పెషలైజేషన్‌లు: క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌, హెల్త్‌ - సేఫ్టీ - ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌

అర్హత: ఎంబీఏ ప్రోగ్రామ్‌లో అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌కు డిగ్రీ(ఇంజనీరింగ్‌/ ఆర్కిటెక్చర్‌/ ప్లానింగ్‌); లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌కు డిగ్రీ(ఇంజనీరింగ్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఆర్కిటెక్చర్‌/ ప్లానింగ్‌/ మేనేజ్‌మెంట్‌/ ఎకనామిక్స్‌/ మేథమెటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ కామర్స్‌/ ఆర్ట్స్‌/ అగ్రికల్చర్‌);బిజినెస్‌ అనలిటిక్స్‌కు ఏదేని డిగ్రీ; సస్టయినబుల్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌కు డిగ్రీ(ఇంజనీరింగ్‌/ ఆర్కిటెక్చర్‌/ సైన్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి.    

  • పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లో క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌కు ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. హెల్త్‌ - సేఫ్టీ - ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌కు ఇంజనీరింగ్‌ డిగ్రీ/బీఎస్సీ(ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతోపాటు మాన్యుఫాక్చరింగ్‌/ మెయింటెనెన్స్‌/ ఆర్‌ అండ్‌ డీ/ సేఫ్టీ విభాగాల్లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. 
  • అభ్యర్థులందరికీ డిగ్రీ స్థాయిలో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి.

ఎంపిక: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ నిక్మర్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (పీజీ - ఎన్‌సీఏటీ): ఈ పరీక్షని ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తారు. క్వాంటిటేటివ్‌ అండ్‌ అనలిటికల్‌ ఎబిలిటీ నుంచి 72, డేటా ఇంట్రప్రిటేషన్‌ నుంచి 36, వెర్బల్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీ నుంచి 72 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 180. 

  • పీజీ - ఎన్‌సీఏటీలో సాధించిన మెరిట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌ ద్వారా గ్రూప్‌ డిస్కషన్స్‌, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జీడీకి 20 మార్కులు, ఇంటర్వ్యూకి 30 మార్కులు కేటాయించారు. రేటింగ్‌ ఆఫ్‌ అప్లికేషన్‌కు 70 మార్కులు నిర్దేశించారు. అకడమిక్‌ ప్రతిభ, అనుభవం ఆధారంగా ఆర్‌ఏ స్కోర్‌ను నిర్ణయిస్తారు.
  • పీజీ - ఎన్‌సీఏటీ, జీడీ, ఇంటర్వ్యూలకు అభ్యర్థులు ఇంటి నుంచి లేదా తమకు అనుకూలమైన ప్రదేశం నుంచి హాజరు కావచ్చు.
  • పీజీ - ఎన్‌సీఏటీ స్కోర్‌నకు 60 శాతం; జీడీ, ఇంటర్వ్యూల స్కోర్‌నకు 16.67 శాతం; రేటింగ్‌ ఆఫ్‌ అప్లికేషన్‌ స్కోర్‌నకు 23.33 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: ఒక ప్రోగ్రామ్‌నకు రూ.2100;  ఒకటి కంటే ఎక్కువ ప్రోగ్రామ్‌లకు రూ.2620

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 2

పీజీ - ఎన్‌సీఏటీ, జీడీ, ఇంటర్వ్యూల తేదీ: అక్టోబరు 6

ఫలితాలు విడుదల: అక్టోబరు 7న

ట్యూషన్‌ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: అక్టోబరు 17

వెబ్‌సైట్‌: www.nicmar.ac.in

Tags :