Education-Article
యూపీఎస్సీ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) - ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (ఈఎ్‌సఈ) 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ తదితర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరింగ్‌ పోస్టులను భర్తీ చేస్తారు. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో సుమారుగా 327 పోస్టులు ఉన్నాయి. 


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో  బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌(ఇండియా)/ ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా నుంచి సెక్షన్‌ - ఏ, సెక్షన్‌ - బీ ఎగ్జామ్‌లు పూర్తిచేసినవారు; ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజనీర్స్‌(ఇండియా)/ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ రేడియో ఇంజనీర్స్‌- లండన్‌ నుంచి గ్రాడ్యుయేట్‌ మెంబర్‌షిప్‌ ఎగ్జామినేషన్‌ ఉత్తీర్ణులు; ఎమ్మెస్సీ(వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ ఎలకా్ట్రనిక్స్‌/ రేడియో ఫిజిక్స్‌/ రేడియో ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 2023 జనవరి 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 


ఈఎస్‌ఈ వివరాలు: ఇందులో మూడు స్టేజ్‌లు ఉంటాయి. మొదటిది ప్రిలిమినరీ/ స్టేజ్‌ - 1 ఎగ్జామ్‌. దీనిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్లో  జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 200 మార్కులకు, రెండో పేపర్లో సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగం నుంచి 300 మార్కులకు మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్న లు ఇస్తారు. మొదటి పేపర్‌కు రెండు గంటలు, రెండో పేపర్‌కు మూడు గంటల పరీక్ష సమయం ఉంటుంది. సమాధానాలను ఓఎంఆర్‌ పత్రం మీద గుర్తించాలి. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే మూడో వంతు మార్కు కోత విధిస్తారు. నిర్దేశించిన మేరకు అర్హత మార్కులు సాధించిన వారిని ఖాళీలకు ఆరు/ ఏడు రెట్ల మందిని ఎంపిక చేసి మెయిన్‌/ స్టేజ్‌-2 ఎగ్జామ్‌నకు అనుమతిస్తారు. మెయిన్‌ ఎగ్జామ్‌ పూర్తిగా అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించి ఉంటుంది. ఇందులో కూడా రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌కు 300 చొప్పున మొత్తం మార్కులు 600. పరీక్ష సమయం మూడు గంటలు. ఇందులో అర్హత సాధించినవారిని ఖాళీలకు రెండు రెట్లమందిని ఎంపిక చేసి పర్సనాలిటీ టెస్ట్‌ / స్టేజ్‌ - 3 ఎగ్జామ్‌నకు పంపుతారు. దీనికి 200 మార్కులు నిర్దేశించారు. మూడు స్టేజ్‌లలో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్‌ ర్యాంక్‌ ఇస్తారు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.200 (మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 4

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి

తెలుగు రాష్ట్రాల్లో మెయిన్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం

ప్రిలిమినరీ/ స్టేజ్‌ - 1 ఎగ్జామ్‌ తేదీ: 2023 ఫిబ్రవరి 19

వెబ్‌సైట్‌: www.upsc.gov.in


Tags :