Education-Article
విద్యాకానుకపై సోషల్‌ మీడియాలో గొప్పలే.. గొప్పలు

జగనన్న విద్యాకానుక పథకం(Educational scheme)పై వైసీపీ అధికారిక సోషల్‌ మీడియా(YCP Official Social Media)లో విడుదల చేసిన పోస్టర్‌ ఇది. ‘బడులు తెరిచిన తొలిరోజే ప్రతి విద్యార్థికి కావాల్సిన అన్ని వస్తువులు ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రభుత్వం’... అంటూ అందులో గొప్పలు చెప్పుకొన్నారు. అయితే ఈ విద్యాసంవత్సరంలో తొలిరోజు అందరికీ కాదు కదా... కొందరికి కూడా విద్యాకానుక అందలేదు. సకాలంలో కిట్లు సరఫరా చేయలేకపోవడంతో బడులు తెరిచిన మొదటి రోజున నాలుగైదు బ్యాగ్‌లు తెప్పించి, వాటినే పంపిణీ చేసి ప్రజా ప్రతినిధులు ఫొటోలు దిగారు. స్కూళ్లు తెరిచిన నాటినుంచి రోజుకు 30 మంది విద్యార్థుల చొప్పున నెలాఖరులోగా అందరికీ కిట్లు పంపిణీ చేయాలని స్వయంగా పాఠశాల విద్యాశాఖ లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. అంటే తొలిరోజున అందరికీ విద్యాకానుక ఇవ్వట్లేదని ప్రభుత్వమే ధ్రువీకరించింది. అయినా పట్టించుకోకుండా మొదటిరోజే అందరికీ కిట్లు పంపిణీ చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారు! 

Tags :