Education-Article
IIMAలో పీహెచ్‌డీ

అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(Indian Institute of Management) (ఐఐఎంఏ) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగు నుంచి అయిదేళ్ల వరకు ఉంటుంది. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు గరిష్ఠంగా రెండు స్పెషలైజేషన్‌లకు అప్లయ్‌ చేసుకోవచ్చు. 

స్పెషలైజేషన్‌లు: అగ్రికల్చర్‌, ఎకనామిక్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఇన్నొవేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌, మార్కెటింగ్‌, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌, ప్రొడక్షన్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ మెథడ్స్‌, పబ్లిక్‌ సిస్టమ్స్‌, స్ట్రాటజీ 

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ/ రెండేళ్ల పీజీ డిప్లొమా/ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ద్వితీయ శ్రేణి మార్కులతో సీఏ/ సీఎస్‌/ సీఎంఏ పూర్తిచేసినవారు; కనీసం 6.5 సీజీపీఏతో నాలుగేళ్ల ప్రొఫెషనల్‌ డిగ్రీ ఉత్తీర్ణులు; ఏ కోర్సులోనైనా చివరి సంవత్సర పరీక్షలు రాసేవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. స్పెషలైజేషన్‌కు నిర్దేశించిన మేరకు జీఆర్‌ఈ/ జీమ్యాట్‌/ గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ లేదా యూజీసీ జేఆర్‌ఎఫ్‌/ ఐకార్‌ ఎస్‌ఆర్‌ఎఫ్‌ అర్హత ఉన్నవారు కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ రాయనవసరం లేదు.

ఫెలోషిప్‌: మొదటి రెండేళ్లు నెలకు రూ.37,700; కాంప్రహెన్సివ్‌ ఎగ్జామ్‌ పూర్తయ్యాక నెలకు రూ.40,700; థీసిస్‌ ప్రపోజల్‌ సబ్మిట్‌ చేశాక నెలకు రూ.45,200లను చెల్లిస్తారు. కంటింజెన్సీ అలవెన్స్‌ కింద ఏడాదికి రూ.25,000 ఇస్తారు. ఇంటర్నేషనల్‌ సెమినార్స్‌, వర్క్‌షా్‌పల నిమిత్తం రూ.1,75,000లు చెల్లిస్తారు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.500

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 26 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2023 జనవరి 17

వెబ్‌సైట్‌: www.iima.ac.in/phd

Tags :