Education-Article
పోర్ట్‌ ఆపరేషన్స్‌లో సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(Indian Institute of Foreign Trade) (ఐఐఎఫ్‌టీ) - పోర్ట్‌ ఆపరేషన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగు నెలలు. ఇది అక్టోబరులో ప్రారంభమౌతుంది. ఇందులో ఫారిన్‌ ట్రేడ్‌ పాలసీ ఆఫ్‌ ఇండియా, బేసిక్స్‌ ఆఫ్‌ షిప్పింగ్‌, పోర్ట్స్‌ - కెనాల్స్‌ - వాటర్‌వేస్‌, పోర్ట్స్‌ అండ్‌ టర్మినల్స్‌, పోర్ట్‌ ఆపరేషన్స్‌, పోర్ట్‌ సర్వీసెస్‌, పోర్ట్‌ డెవల్‌పమెంట్‌, ఎన్విరాన్‌మెంట్‌ - హెల్త్‌ - సేఫ్టీ, మారిటైం సెక్యూరిటీ తదితర అంశాలు వివరిస్తారు. శని, ఆది వారాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆన్‌లైన్‌ సెషన్స్‌ ఉంటాయి. అడ్మిషన్‌ పొందిన వెంటనే స్టడీ మెటీరియల్‌ అందిస్తారు. 

అర్హత: డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులు; మారిటైం ప్రొఫెషనల్స్‌, షిప్స్‌ ఆఫీసర్స్‌, షోర్‌ బేస్డ్‌ మేనేజ్‌మెంట్‌ స్టాఫ్‌, సప్లయ్‌ చెయిన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇండస్ట్రీ అండ్‌ ట్రేడ్‌ ప్రొఫెషనల్స్‌, పీ అండ్‌ ఐ క్లబ్‌ మేనేజర్స్‌, పోర్ట్‌ అథారిటీస్‌ అండ్‌ కోస్ట్‌ గార్డ్‌ పర్సనల్‌, కార్గో అండ్‌ లాజిస్టిక్స్‌ ప్రొవైడర్స్‌ దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి నిబంధనలు లేవు. 


ప్రోగ్రామ్‌ ఫీజు: రూ.90,000 (దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం రాయితీ లభిస్తుంది)

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 27 

వెబ్‌సైట్‌: www.iift.ac.in

Tags :