Education-Article
ఇక్ఫాయ్‌కు న్యాక్‌ అక్రెడిటేషన్‌

హైదరాబాద్‌(Hyderabad)లోని డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ(Deemed to be University) - ఐసీఎఫ్‌ఏఐ(ఇక్ఫాయ్‌) ఫౌండేషన్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌కు న్యాక్‌(ద నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌) ఎ++ గ్రేడ్‌ అక్రెడిటేషన్‌ లభించింది. 4కి 3.59 సీజీపీఏ లభించింది. ఈ సెప్టెంబర్‌ 13 నుంచి 2027 సెప్టెంబర్‌ 13 వరకు అంటే అయిదేళ్ళ కాలానికి ఆ అక్రెడిటేషన్‌ను న్యాక్‌ మంజూరు చేసింది. దేశంలో వెయ్యి వర్సిటీలు ఉండగా ముప్పయ్‌ సంస్థలకు మాత్రమే ఈ గ్రేడ్‌ ఉందని, అందులో తమది ఒకటిగా నిలిచిందని సంస్థ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఎల్‌.ఎస్.గణేష్‌ ఈ సందర్భంలో తెలిపారు. 

Tags :