Education-Article
పసిపిల్లలపై పరీక్షల ప్రయోగం

వినూత్న పద్ధతికి తెరతీసిన విద్యాశాఖ

ఎఫ్‌ఏ-1 పరీక్షల్లో ఓఎంఆర్‌ షీట్స్‌ 

వాటిపై విద్యార్థులకు అవగాహన శూన్యం

స్కూళ్లకు ఆలస్యంగా పాఠ్యపుస్తకాలు 

నేటికీ షెడ్యూల్‌పై రాని స్పష్టత

అయోమయంలో ఉపాధ్యాయులు, అధికారులు

అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు


అనంతపురం విద్య : పరీక్షలపై ప్రయోగాలు(Experiments) చేస్తున్నారు. కాదు...విద్యార్థుల జీవితాలపై ప్రయోగం చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా తొలిసారి ఎఫ్‌ఏ- 1 పరీక్షల్లోనూ ఓఎంఆర్‌ షీట్స్‌ ప్రయోగం చేయబోతోంది పాఠశాల విద్యాశాఖ(School Education Department). అయితే విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. ముఖ్యంగా 8వ తరగతి సిలబస్‌ మారింది. మారిన పుస్తకాలు ముందే ఇస్తే...అటు టీచర్లకు, ఇటు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. 8వ క్లాస్‌ పుస్తకాలు నేటికీ ఇవ్వలేదు. ఒక్కో మండలానికి ఒక్కో రకంగా ఇచ్చారు. దీనికితో ఎఫ్‌ఏ-1 పరీక్షల్లో ఓఎంఆర్‌ షీట్స్‌, ప్రశ్నపత్రాల మోడల్‌ పేపర్లు ఇవ్వలేదు. ఇక షెడ్యూల్‌ గురించి కూడా స్పష్టత లేదు. దీంతో పరీక్షలపై ప్రయోగాలు పిల్లలపై ప్రభావం చూడమే కాకుండా ఇటు అధికారులను, అటు ఉపాధ్యాయులను అయోమయానికి గురి చేస్తున్నాయి.


కొత్త షెడ్యూల్‌ ఎప్పుడో..?

ఎఫ్‌ఏ -1 పరీక్షల షెడ్యూల్‌ను గతంలోనే నిర్ణయించారు. దీని మేరకు సెప్టెంబరు 7, 8, 9 తేదీల్లో పరీ క్షలు నిర్వహించాల్సి ఉంది. అదేవిధంగా  15వ తేదీలోగా ఆ పరీక్షల తాలూకు మార్కులను విద్యార్థుల వారీగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. అయితే నిర్ణీత తేదీల మేరకు ప్రభుత్వ స్కూళ్లలో పరీక్షలు నిర్వహించలేదు. ఉన్నఫలంగా వాయిదా వేశారు. అయితే కొత్త షెడ్యూల్‌ ఎప్పుడు ఇస్తారు.. ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారన్న అంశంపై నేటికీ క్లారిటీ ఇవ్వలేదు.


అందని మారిన సిలబస్‌ పుస్తకాలు

ఈ ఏడాది 8వ తరగతి సిలబ్‌సను మార్చారు. ఈ క్రమంలో  ఆ పుస్తకాలను ముందే స్కూళ్లకు చేర్చాలి. ముందుగానే వాటిని స్కూళ్లకు సప్లైయ్‌ చేస్తే.... టీచర్ల సైతం వాటిని ప్రిపేర్‌ అవుతారు. పిల్లలకు ఎలా బోధిస్తే...బాగా అర్థమవుతుంతో, ఏయే పద్ధతుల్లో బోధిస్తే...సులువుగా నేర్చుకుంటారో  తెలుసుకోడానికి అవకాశం ఉంటుంది. టీచర్ల బోధించే సమయానికి పిల్లల చేతిలో పుస్తకం ఉంటే ప్రిపేర్‌ కావడానికి మార్గం సుగమం అవుతుంది. అయితే మారిన సిలబస్‌ పుస్తకాలు ఇప్పటి వరకూ స్కూళ్ల చాలా వరకూ చేరలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లకు పాఠ్యపుస్తకాల ఇండెంట్‌ 31,43,820 లక్షలు కాగా...అన్నీ పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నారు. కానీ నేటికీ 8వ తరగతి విద్యార్థులకు సెమిస్టర్‌ -1 పుస్తకాలు ఒకటి ఇస్తే..మరొకటి ఇవ్వలేదు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ ఇస్తే...గణితం, సోషల్‌ ఇవ్వలేదు. సైన్స్‌ పుస్తకాలు ఇస్తే...లాంగ్వేజేస్‌ ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అసలే మారిన సిలబస్‌ కావడం ఒక సమస్య అయితే....వాటికి కూడా పిల్లల చేతికి చేర్చకపోవడం మరింత సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యాశాఖ ప్రయోగాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


తొలిసారి ఓఎంఆర్‌ షీట్స్‌ విధానం!

ఈ ప్రభుత్వం వచ్చాక తొలి సారి ఏడాది ఎఫ్‌ఏ-1 పరీక్షలపై ప్రయోగాలు చేయనున్నారు. ఎఫ్‌ఏ -1 పరీక్షల్లో ఓఎంఆర్‌ షీట్స్‌(OMR Sheets) ఇవ్వనున్నట్లు సమాచారం. దీనిపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలను వ్యక్త మవుతున్నాయి. పోటీ పరీక్షలు, ఇతర ఉన్నత విద్యా పరీక్షల్లో పెట్టే ఈ ఓఎంఆర్‌ విధానాన్ని పాఠశాల విద్యలో ప్రయోగించడంపై విమర్శలు వస్తున్నాయి. పైగా ఇప్పటి వరకూ ప్రశ్నపత్రాల మోడల్స్‌ కానీ, ఎన్ని మార్కులకు  పెడుతారు..? ఎప్పటి నుంచి నిర్వహిస్తారన్న అంశాలపై విద్యాశా ఖాధికారులకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో దీనిపై గందరగోళం నెలకొంది. ఈ ప్రయోగాల కారణంగానే ఎఫ్‌ఏ-1 పరీక్షలకు అకడమిక్‌ కేలండర్‌లో తేదీలు నిర్ణయించి కూడా మళ్లీ వాయిదా వేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Tags :