Education-Article
గురువులపై గురి

హేతుబద్ధీకరణతో హైస్కూల్‌ టీచర్లపై పెనుభారం

ఉమ్మడి జిల్లాలో ఎస్జీటీ పోస్టుల భర్తీ ఇకలేనట్లే..!


ధర్మవరం, అనంతపురం: ప్రభుత్వం తమపై కత్తి కట్టిందని ఉపాధ్యాయులు(ap teachers) చెందుతున్న ఆందోళన నిజమైంది. తాజాగా వారిపై మరో పిడుగు పడింది. సవరించిన చైల్డ్‌ ఇన్ఫో డేటా ప్రకారం టీచర్ల సర్‌ప్లస్‌, హేతుబద్ధీకరణ అనంతరం పాఠశాలల వారీగా ఉపాధ్యాయ పోస్టుల సంఖ్యను విద్యాశాఖ వారం రోజుల క్రితం విడుదల చేసింది. ఆ ప్రకారం ఉమ్మడి జిల్లాలో భారీగా టీచరు పోస్టులు (వర్కింగ్‌, వేకేన్సీలు కాకుండా) పోవడంతోపాటు మిగులు టీచర్లను అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నారు. దీంతో టీచర్లపై పనిభారం కూడా పెరగనుంది. అదనపు పీరియడ్లు బోధించాల్సి ఉంటుంది. తాజా పరిణామాలపై ఉపాధ్యాయల నుంచి తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.


పెరగనున్న ఏకోపాధ్యాయ పాఠశాలలు

విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 1:20 చొప్పున ఉపాధ్యాయుడు, విద్యార్థులు ఉంటారు. అంటే 20 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ అన్నమాట. ఆ లెక్కన జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఏకోపాధ్యాయుడు సెలవు పెడితే పాఠశాల నిర్వహించేదెవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల పరిస్థితి మరీ దారుణమని చెప్పొచ్చు. మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న యూపీ స్కూళ్లలో 97లోపు విద్యార్థులు ఉంటే అక్కడి నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌, ఉపాధ్యాయులను తీసివేసి, కేవలం ఎస్జీటీ పోస్టులనే ఇస్తారు. ఇక్కడ 1:30 నిష్పత్తితో ముగ్గురు ఎస్జీటీలను మాత్రమే కేటాయిస్తారు. ఆ ప్రకారం 3 నుంచి 8 తరగతుల వరకు విద్యార్థులకు కేవలం ముగ్గురు టీచర్లే బోధించాల్సి ఉంటుంది. హైస్కూళ్ల విషయానికొస్తే సబ్జెక్టుల వారీగా, సెక్షన్ల వారీగా టీచర్ల సంఖ్యను నిర్ధారించారు. ఆ ప్రకారం ఒక్కో సెక్షనలో విద్యార్థుల సంఖ్యను అమాంతం పెంచేసి, ఒకరిద్దరు సబ్జెక్టు టీచర్లపైనే పనిభారం మోపనున్నారు.


ఉద్యోగోన్నతులు, సర్‌ప్లస్‌ వేకెన్సీలు ఇలా..

జిల్లాలో ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, రేషనలైజేషనపై జరుగుతున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. హెచఎం పోస్టులకు ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయుల పోస్టులను అప్‌గ్రెడేషన చేయడం మాత్రమే జిల్లాలో సాఽధ్యపడేలా ఉందని ఓ అంచనాకు వచ్చారు. మిగతా పోస్టుల ఉద్యోగోన్నతికి సంబంధిత కన్వర్షన సబ్జెక్టుల్లో అవసరమైన విద్యార్హతలుతప్పనిసరి అయినందున సమస్య ఏర్పడే అవకాశాలున్నట్లు గుర్తించారు. మొత్తం ఉద్యోగోన్నతి పోస్టుల్లో 60 శాతం పోస్టులను ఇనసర్వీ్‌స టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా, మిగతా 40 శాతం డీఎస్సీ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నట్లు ఉపాధ్యాయ వర్గాల సమాచారం. సబ్జెక్టు కన్వర్షనకు అవసరమైన సంఖ్యలో తగిన విద్యార్హతల ఇనసర్వీస్‌ టీచర్లు జిల్లాలో లేకపోతే ఆ పోస్టులను డీఎస్సీలో చేర్చి, భర్తీ చేస్తారు. సర్‌ప్లస్‌ (మిగులు) ఉపాధ్యాయ ఖాళీలు 460 ఉన్నట్లు ధ్రువీకరించారు. ఇందులో ఫిజిక్స్‌ 200, బయాలజీ 30కిపైగా, సోషల్‌ 30కిపైగా ఎల్‌ఎ్‌ఫఎల్‌ హెచఎం 200కిపైగా సర్‌ప్లస్‌ వేకెన్సీలుగా నిర్ధారించారు. ఇంగ్లీషు, గణితానికి సంబంధించి కోర్టు కేసులు ఉండటం వల్ల ఇవ్వలేదు. జిల్లాలో ఉద్యోగోన్నతులు, సర్‌ప్లస్‌, వెకెన్సీల సంఖ్య ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో కొద్దిరోజుల్లోనే టీచ ర్ల ఉద్యోగోన్నతులకు  బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేయడానికి పాఠశాల విద్యాశాఖ చర్యలను వేగవంతం చేసింది. హేతుబద్ధీకరణతో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులపై ప్రభుత్వం భారం మోపింది. వారానికి 42 పీరియడ్లు బోధించాలంటే కష్టతరం. ప్రిపరేషనకు అవకాశం ఉండదు. నానస్టా్‌పగా బోధించాల్సి ఉంటుంది. దీంతో ఉపాధ్యాయుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.


ఎస్జీటీ పోస్టుల భర్తీ ఇక లేనట్లే..!

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సెకండరీ గ్రేడ్‌ టీచరు (ఎస్జీటీ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాల్సిన అవసరం లేకుండా తాజాగా చేపట్టిన రేషనలైజేషనను వినియోగించుకోనున్నారు. వాస్తవానికి ఈ ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందంటూ ఈ పోస్టుల ఊసెత్తడం లేదు. ఇప్పుడు ఈ పోస్టులకు ప్రభుత్వం మంగళం పాడినట్టేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు.


హైస్కూల్‌ టీచర్లకు 42 పీరియడ్లు

తాజా లెక్కలతో హైస్కూల్‌ ఉపాధ్యాయులపై పనిభారం పెరగనుంది. ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో ఒక్కో ఉపాధ్యాయుడు వారానికి 24 నుంచి 32 పీరియడ్ల చొప్పున బోధిస్తున్నారు. ఇకపై గరిష్ఠంగా 42 పీరియడ్లు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సబ్జెక్టు పీరియడ్లు (వర్కింగ్‌) వారానికి 36తోపాటు, మరో సబ్జెక్టును ఎక్స్‌ట్రా కరికులంగా చేర్చి, మరో 6 పీరియడ్లు బోధించేలా పనిభారాన్ని పెంచనున్నారు. సవరించిన జీఓ 128 ప్రకారమే హైస్కూళ్లలో సెక్షన్లసంఖ్యను నిర్ధారించి, టీచరు పోస్టులను హేతుబద్ధీకరిస్తారు. అనంతరం సర్‌ప్లస్‌ టీచర్లను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు. దీంతో మిగిలిన ఉపాధ్యాయులపై అదనపు పనిభారం పడటం ఖాయం.


ప్రభుత్వం పునరాలోచించాలి

హేతుబద్ధీకరణతో హైస్కూల్‌ ఉపాధ్యాయులకు వారానికి 42 పీరియడ్లు బోధించేలా భారం మోపడం దారుణం. దీనిపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం పునరాలోచించాలి.

- శెట్టిపి జయచంద్రారెడ్డి, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

Tags :