Education-Article
అదనపు తరగతి గదులకు భూమిపూజ

ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌


వెలిగండ్ల, ఆగస్టు 4 : నాడు-నేడు ద్వారా అదనపు తరగతి గదులకు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ గురువారం భూమి పూజ చేశారు. మండలంలోని మె గళ్లూరు హైస్కూల్‌లో రూ.84 లక్షలతో అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నాడునేడుతో గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మా ర్చుతున్నామని చెప్పారు. అనంతరం ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ ర్యాలీలో విద్యా ర్థులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో దాసుప్రసాద్‌, ఏఈ బాలకృష్ణ, ఎంపీడీవో సుకుమార్‌, హెచ్‌ఎం కొండారెడ్డి, ఉడుముల వెంకటేశ్వరరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. 

Tags :