Education-Article
బాసర ట్రిపుల్‌ ఐటీ మెస్‌ కాంట్రాక్టులన్నీ ఎంపీ సంతోష్‌ బంధువుల చేతుల్లోనే..!

రౌండ్‌ టేబుల్‌ భేటీలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆకునూరి మురళి 

బాసర విద్యార్థులకు సంఘీభావం 


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యాసంస్థ భోజనశాల నిర్వహణలో ఎంపీ సంతోష్‌ బంధువులు, సన్నిహితులు కాంట్రాక్టర్లుగా చలామణి అవుతున్నారని సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం కన్వీనర్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆకునూరి మురళి ఆరోపించారు. విద్యార్థుల నోటి దగ్గర బువ్వను కాంట్రాక్టర్లు బొక్కుతున్నారంటూ విమర్శించారు. ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమం పచ్చి మోసమని, ఆ పథకం పేరుతో పాటు అందుకు కేటాయించిన రూ.7,200 కోట్లు తెలంగాణ పద్దు పుస్తకంలో ఎక్కడా కనిపించదని ఆరోపించారు. బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా గురువారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యవక్తగా హాజరైన ఆకునూరి మురళి మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మక ట్రిపుల్‌ ఐటీ విద్యాసంస్థకు వెంటనే రెగ్యులర్‌ వీసీని, డైరెక్టర్‌ను, ఫైనాన్షియల్‌ అధికారులను నియమించాలని డిమాండ్‌ చేశారు. 

Tags :