బాసర, ఆగస్టు, 4: బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ(Basara RGUKT Triple IT)లో విద్యార్థులకు భరోసా కల్పించే చర్యలు చేపడుతున్నారు. గత కొన్ని రోజుల నుండి మెస్‌లలో విద్యార్థులకు వడ్డించే భోజనం(meal)లో పురుగులు రావడం, ఇటీవలే పుడ్‌పాయిజన్(Pudpoison) జరిగి వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో మరోసారి అలాంటి ఘటన జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి విద్యార్థులతో కలిసి డైరెక్టర్ సతీష్‌కుమార్ ఇతర ఉన్నతాధికారులు భోజనం చేశారు. విద్యార్థుల(students)కు వడ్డించే ఆహారాన్ని వారి సమక్షంలోనే భుజించారు. అనంతరం వంటకు వినియోగించే సరుకులను డైరెక్టర్ తనిఖీ చేశారు. గతంలో పొరపాట్లు జరిగి ఉండవచ్చుకానీ ఇప్పుడు మాత్రం విద్యార్థులకు నాణ్యత గల ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు డైరెక్టర్ సతీష్ కుమార్(Directed by Satish Kumar) తెలిపారు.