మైసూర్ విశ్వవిద్యాలయం(Mysore University) ఆధ్వర్యంలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(School of Planning and Architecture) - బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ప్లానింగ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
బీ ఆర్క్: ప్రోగ్రామ్ వ్యవధి అయిదేళ్లు. మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్/ పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మేథమెటిక్స్ ప్రధాన సబ్జెక్ట్‌గా మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసినవారు కూడా అర్హులే. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఆర్కిటెక్చర్(నాటా) అర్హత తప్పనిసరి.
బీటెక్ ప్లాన్: ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. సైన్స్ గ్రూప్‌తో ఇంటర్/ పన్నెండోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా(ఆర్కిటెక్చర్/ సివిల్) పూర్తిచేసినవారు కూడా అర్హులే. ఇంగ్లీష్, ఫిజిక్స్, మేథమెటిక్స్తోపాటు కెమిస్ట్రీ/ ఇంజనీరింగ్ డ్రాయింగ్/ కంప్యూటర్ సైన్స్/ బయాలజీ/ టెక్నికల్ ఒకేషనల్ సబ్జెక్ట్ చదివి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1000
చివరి తేదీ: ఆగస్టు 5
దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: పదోతరగతి, ఇంటర్/ పన్నెండోతరగతి/ డిప్లొమా మార్కుల పత్రాలు, నాటా స్కోర్ కార్డ్, ఆధార్ కార్డ్, టీసీ, కులం - ఆదాయం ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్
మెరిట్ లిస్ట్ విడుదల: ఆగస్టు 8న
అడ్మిషన్ ప్రక్రియ: ఆగస్టు 9 నుంచి 13 వరకు
చిరునామా: డైరెక్టర్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, యూవోఎం, మానస గంగోత్రి, మైసూర్
వెబ్సైట్: www.spa.uni-mysore.ac.in