నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్(National Institute of Plant Health Management)(ఎన్ఐపీహెచ్ఎం) - మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుల్లో ప్రవేశానికి విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఒక్కో కోర్సు వ్యవధి మూడు నెలలు. ఆంగ్ల మాధ్యమం(English medium)లో బోధన ఉంటుంది. నిబంధనల ప్రకారం కోర్సులు పూర్తిచేసినవారికి సర్టిఫికెట్(Certificates)లు ప్రదానం చేస్తారు.
ప్లాంట్ బయోసెక్యూరిటీ
ఈ కోర్సులో ప్లాంట్ క్వారంటైన్ సిస్టం, ప్లాంట్ బయో సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ రెగ్యులేషన్స్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రొసీజర్స్ - ప్లాంట్స్ అండ్ ప్లాంట్ ప్రొడక్ట్స్, ఫైటో శానిటరీ ట్రీట్మెంట్, హార్మొనైజేషన్ ఆఫ్ ఫైటో శానిటరీ మెజర్స్ తదితర అంశాలు వివరిస్తారు. కోర్సు మొత్తమ్మీద 24 లెక్చర్స్ ఉంటాయి.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు కనీసం 20 ఏళ్లు నిండి ఉండాలి.
రోడెంట్స్ అండ్ హౌస్‌హోల్డ్ పెస్ట్ మేనేజ్మెంట్
అర్హత: సైన్స్ సబ్జెక్ట్లతో ఇంటర్ ఉత్తీర్ణత. ఏ గ్రూప్‌తోనైనా ఇంటర్/ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు ఏదేని పెస్ట్ కంట్రోల్ సంస్థలో పనిచేసిన అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ : ఆగస్టు 19
ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ : ఆగస్టు 25
వెబ్సైట్ : https://niphm.gov.in