Education-Article
Amrita Universityలో పీహెచ్‌డీ

అమృత విశ్వ విద్యాపీఠమ్‌ యూనివర్సిటీ - ఫుల్‌టైమ్‌, పార్ట్‌టైమ్‌ పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతోంది. ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ ఆర్ట్స్‌, సైన్సెస్‌, హ్యుమానిటీస్‌, ఇంటర్‌డిసిప్లినరీ స్టడీస్‌, మెడికల్‌ సైన్సెస్‌, మీడియా, కామర్స్‌లో పీహెచ్‌డీకి అవకాశం ఉంది. పీహెచ్‌డీకి అర్హులైన అభ్యర్థులకు నిధుల లభ్యతకు లోబడి నెలకు రూ.40,000 స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. పలు అంతర్జాతీయ సంస్థలతో ఈ వర్సిటీకి కొలాబిరేషన్‌ ఉంది. కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత పీజీ ఉత్తీర్ణులు అర్హులు. అకడమిక్‌ రికార్డులు, ఆన్‌లైన్‌ ఇంటర్వూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు లింక్‌: https://amrita.edu/2022PhD

Tags :