Education-Article
NIEPIDలో డిప్లొమాలు

సికింద్రాబాద్‌, మనోవికాస్‌నగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ద ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటెలెక్చువల్‌ డిజెబిలిటీస్‌ (ఎన్‌ఐఈపీఐడీ) - డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సికింద్రాబాద్‌ సహా కోల్‌కతా, నవీ ముంబై రీజనల్‌ సెంటర్లలో ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి సెంటర్‌లో ఒక్కో ప్రోగ్రామ్‌లో 30 సీట్లు ఉన్నాయి. 


డిప్లొమా ప్రోగ్రామ్‌లు

  • డిప్లొమా ఇన్‌ ఒకేషనల్‌ రీహేబిలిటేషన్‌ ప్రోగ్రామ్‌ సికింద్రాబాద్‌, నవీ ముంబై, కోల్‌కతా సెంటర్లలో అందుబాటులో ఉంది.
  • డిప్లొమా ఇన్‌ ఎర్లీ చైల్డ్ హుడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ సికింద్రాబాద్‌, నవీ ముంబై సెంటర్లలో ఉంది. 

అర్హత: ద్వితీయ శ్రేణి మార్కులతో ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. 

చివరి తేదీ: జూలై 29

వెబ్‌సైట్‌: www.niepid.nic.in

Tags :