Education-Article
ANDHRA UNIVERSITYలో ఇంటిగ్రేటెడ్‌ బీబీఏ-ఎంబీఏ

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తున్న స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ (ఏయూఎస్‌ఐబీ) అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీబీఏ - ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రోగ్రామ్‌లో భాగంగా ఫౌండేషన్‌ కోర్సులు, కోర్‌ కోర్సులు, సెంట్రిక్‌ ఎలక్టివ్‌లు ఉంటాయి. మొదటి మూడేళ్ల కోర్సు పూర్తిచేసిన తరవాత ప్రోగ్రామ్‌ నుంచి వైదొలగే వీలుంది. వీరికి బీబీఎం డిగ్రీని ప్రదానం చేస్తారు. ప్రోగ్రామ్‌లో మొత్తం 120 సీట్లు ఉన్నాయి. గ్రూప్‌ డిస్కషన్స్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

స్పెషలైజేషన్‌లు: మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదేని గ్రూప్‌తో ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసి ఫలితాల కోసం చూస్తున్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.  


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1200; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 3 

గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలు: జూలై 6, 7 

సీట్ల అలాట్‌మెంట్‌: జూలై 8న

వెబ్‌సైట్‌: ausib.audoa.in

Tags :