Education-Article
Osmania Universityలో డిప్లొమాలు

ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఆధ్వర్యంలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ నిర్వహిస్తున్న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫ్రెంచ్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జర్మన్‌ - డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖా స్తులు కోరుతున్నాయి.  ఫ్రెంచ్‌, జర్మన్‌ లాంగ్వేజ్‌లలో కంప్రెస్‌డ్‌ జూనియర్‌ డిప్లొమా, కంప్రెస్‌డ్‌ సీనియర్‌ డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌లు అందుబాటు లో ఉన్నాయి. స్పెషల్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


కంప్రెస్‌డ్‌ జూనియర్‌ డిప్లొమా

ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగు నెలలు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

కంప్రెస్‌డ్‌ సీనియర్‌ డిప్లొమా

ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగు నెలలు. కనీసం 50 శాతం మార్కులతో జూనియర్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ స్థాయిలో సెకండ్‌ లాంగ్వేజ్‌ కింద ఫ్రెంచ్‌/ జర్మన్‌ చదివి ద్వితీయ శ్రేణి మార్కులు సాధించినవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. 

అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా

ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. కనీసం 50 శాతం మార్కులతో సీనియర్‌ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 2 

పూర్తి సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్‌: 8331041309. 

వెబ్‌సైట్‌: www.osmania.ac.in

Tags :