Education-Article
కర్కటక రేఖను ఖండిస్తూ ప్రవహిస్తున్న నదులేవి? పోటీ పరీక్షల ప్రత్యేకం!

భారతదేశం అక్షాంశాలపరంగా ఉత్తరార్థగోళంలో, రేఖాంశాలపరంగా పూర్వార్థ గోళంలో విస్తరించి ఉంది. అధిక విస్తీర్ణంతోపాటు ఖండానికి ఉండాల్సిన భౌతిక, సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యాలను కలిగి ఉండటం వల్ల భారత్‌ను ఉపఖండం అని పిలుస్తారు.


భారత ఉపఖండంలోని దేశాలు

1. భారతదేశం 2. పాకిస్థాన్‌ 3. నేపాల్‌

4. భూటాన్‌ 5. బంగ్లాదేశ్‌ 6. శ్రీలంక

7. మాల్దీవులు

 • ఒకవైపున భూభాగం, మూడు వైపులా నీరు ఉండటం చేత భారత్‌ను ద్వీపకల్పంగా పిలుస్తారు.
 • ప్రపంచంలో అతి పెద్ద ద్వీపకల్పం - అరేబియా
 • ప్రపంచంలో రెండో పెద్ద ద్వీపకల్పం - దక్షిణ భారత్‌


భారతదేశం - పేర్లు

భారతదేశం: దుష్యంతుడు, శకుంతలాదేవీ కుమారుడు భరతుడు పాలించిన రాజ్యం కనుక మన దేశానికి భారతదేశం/భరతఖండం/భరతవర్షం అనే పేర్లు ఉన్నాయి.

ఇండియా: భారత్‌కు ‘ఇండియా’ అనే పేరు గ్రీకులు పెట్టారు. సింధు నదిని గ్రీకులు ‘ఇండస్‌’ అని, భారతీయులను ‘ఇండోయిలు’ అని పిలిచి, ఇండోయి నివశించే ప్రాంతానికి ‘ఇండియా’ అని పేరు పెట్టారు.

మెగస్తనీస్‌ తన ‘ఇండికా’ గ్రంథంలో మన దేశాన్ని ‘ఇండియా’ అని పేర్కొన్నాడు. ఇతను గ్రీకు చరిత్రకారుడు. క్రీ.పూ.303లో సెల్యూకస్‌ నికేటర్‌ రాయబారిగా ‘చంద్ర గుప్త మౌర్య’ ఆస్థానానికి మెగస్తనీస్‌ వచ్చాడు.

హిందుస్థాన్‌: పర్షియన్లు భారతదేశాన్ని ‘హిందుస్థాన్‌’ అని పిలిచేవారు.


అక్షాంశాలు, రేఖాంశాల పరంగా భారతదేశ ఉనికి

 • అక్షాంశాల పరంగా భారత్‌ 80 నుంచి 370 61 ల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది.
 • అండమాన్‌ నికోబార్‌ దీవులు 60 451 ఉత్తర అక్షాంశాల వద్ద ప్రారంభమవుతాయి
 • భారతదేశాన్ని రెండు అర్థభాగాలుగా విభజించే అక్షాంశం - కర్కాటకరేఖ(23 1/20 ఉత్తర అక్షాంశాన్ని కర్కటక రేఖ అంటారు) 
 • కర్కటక రేఖ భారత్‌లోని 8 రాష్ట్రాల గుండా వెళుతుంది. అవి... 

1. గుజరాత్‌(గాంధీనగర్‌ సమీపంలో), 

2. రాజస్థాన్‌(తక్కువ దూరం), 

3. మధ్యప్రదేశ్‌(భోపాల్‌కు సమీపంలో), 

4. ఛత్తీగఢ్‌(బైకుంఠాపూర్‌), 

5. జార్ఖండ్‌(రాంచీ గుండా), 

6. పశ్చిబెంగాల్‌(దుర్గాపూర్‌ సమీపంలో), 

7. త్రిపుర       8.మిజోరం

 • కర్కటక రేఖ అధిక దూరం ప్రయాణించే రాష్ట్రం - మధ్యప్రదేశ్‌
 • కర్కటక రేఖ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం - రాజస్థాన్‌


 కర్కటక రేఖను ఖండిస్తూ ప్రవహిస్తున్న నదులు: 

 1. గుజరాత్‌ - సబర్మతి

 2. రాజస్థాన్‌-  మాహీ నది (కర్కటక రేఖను రెండు సార్లు ఖండించే నది. మొదట మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ సరిహద్దులో; రెండోసారి రాజస్థాన్‌, గుజరాత్‌ సరిహద్దులో ఖండిస్తుంది)

 3. మధ్యప్రదేశ్‌(భోపాల్‌ సమీపంలో): 

1. బెట్వా, 2. క్షీప్రా(కుంభమేళా ఉత్సవాలు నిర్వహించే నది), 3. చంబల్‌, 4.సోన్‌

 4. జార్ఖండ్‌- దామోదర్‌

 5. పశ్చిమ బెంగాల్‌ - హుగ్లీ 


రేఖాంశాల పరంగా

 • రేఖాంశాల పరంగా భారతదేశం 680 71 నుంచి 970 251 ల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
 • భారతదేశ కాల ప్రామాణిక రేఖాంంశం 82 1/20 ల తూర్పు రేఖాంశం. ఈ రేఖాంశం 5 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం గుండా వెళ్తుంది. అవి...
 • 1. ఉత్తర ప్రదేశ్‌- అలహాబాద్‌, వారణాసి, మీర్జాపూర్‌(వింద్యాచల్‌ రైల్వే స్టేషన్‌కు మధ్యలో వెళ్తుంది), 
 • 2. ఛత్తీగఢ్‌- రాయ్‌పూర్‌, బైకుంటపూర్‌, 
 • 3. మధ్యప్రదేశ్‌ - జబల్‌పూర్‌, రేవా, 
 • 4. ఒడిసా- కోరాపుట్‌,  5. ఆంధ్రప్రదేశ్‌ - కాకినాడ
 • కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని యానాం జిల్లా గుండా వెళ్తుంది.
 • రేఖాంశాల పరంగా అరుణాచల్‌ప్రదేశ్‌ను సూర్యుడు ఉదయించే రాష్ట్రంగా పిలుస్తారు
 • సూర్యుడు అస్తమించే రాష్ట్ర - గుజరాత్‌
 • భారత్‌లో సూర్యకిరణాలు మొదట తాకే ప్రాంతం - థాంగ్‌(అరుణాచల్‌ ప్రదేశ్‌)
 • ప్రపంచంలో సూర్యకిరణాలు మొదటగా తాకే ప్రాంతం: టుంగా దీవులు


భారత్‌ చివరి కొనలు

 • భారత్‌ ఉత్తర కొన - కిలిక్‌ ధావన్‌ పాస్‌(ఇందిరా కాల్‌)
 • ఇండియా ప్రధాన భూభాగపు దక్షిణ కొన - కన్యాకుమారి(కేప్‌ ఆఫ్‌ కామెరూన్‌)
 • దీవులతో కలుపుకొని దక్షిణపు కొన - పిగ్మేలియన్‌ పాయింట్‌/ఇందిరా పాయింట్‌
 • ఇండియా తూర్పు కొన - దిల్ఫాకనుమ/పూర్వాంచల్‌ పర్వతాలు/కిబుతూ ప్రాంతం(అరుణాచల్‌ప్రదేశ్‌)
 • భారత్‌ పశ్చిమ కొన - రాణ్‌ ఆఫ్‌ కచ్‌/ద్వారకా/గర్‌ మోట(గుజరాత్‌)
 • భారత్‌ ఉత్తర, దక్షిణ కొనల మధ్య దూరం 3212 కి.మీ.
 • భారత్‌ తూర్పు, పశ్చిమ కొనల మధ్య దూరం 2933 కి.మీ.
 • అరుణాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల మధ్య ఉన్న రేఖాంశాల సంఖ్య - 30.  ఈ రెండు రాష్ట్రాల మధ్య సమయ భేదం - 2 గంటలు(120 నిమిషాలు)
 • భారతదేశ సమయం గ్రీనిచ్‌ సమయం కంటే 51/2 గంటలు ఎక్కువగా ఉంటుంది.


భారతదేశ విస్తీర్ణం

 • భారత్‌ విస్తీర్ణం - 32, 87, 263 చ.కీ.మీ.(3.28 మిలియన్‌ చ.కీ.మీ.)
 • భారతదేశ విస్తీర్ణం... ప్రపంచం మొత్తం ఖండ భూభాగ విస్తీర్ణంలో 2.4 శాతం, భూఉపరితల(ఖండాలు, మహా సముద్రాలు) విస్తీర్ణంలో 0.57 శాతం ఆక్రమిస్తుంది.
 • ప్రపంచంలో వైశాల్యపరంగా భారత్‌ స్థానం - 7
 • మొదటి 7 పెద్ద దేశాలు: 1. రష్యా, 2. కెనడా, 
 • 3. అమెరికా, 4. చైనా, 5. బ్రెజిల్‌, 6. ఆస్ట్రేలియా, 
 • 7. భారతదేశం
 • ప్రపంచంలో అతి చిన్న దేశం: వాటికన్‌ సిటీ- 0.49 చ.కి.మీ.
 • విస్తీర్ణపరంగా అతి పెద్ద రాష్ట్రాలు: రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌
 • విస్తీర్ణపరంగా అతి చిన్న రాష్ట్రాలు: గోవా, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్‌


భారతదేశ భూసరిహద్దు

 • భారత్‌ 15,106.7 కి.మీ. పొడవైన భూసరిహద్దును కలిగి దేశంలోని 16 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు దేశానికి పొరుగున ఉన్న 7 దేశాలతో భూ సరిహద్దును పంచుకుంటున్నాయి.
 • భారత్‌తో అధిక భూసరిహద్దును పంచుకుంటున్న దేశం - బంగ్లాదేశ్‌(4096 కి.మీ.)
 • భారత్‌తో అతి తక్కువ సరిహద్దు పంచుకుంటున్న దేశం - ఆఫ్ఘానిస్థాన్‌(106 కి.మీ.)
 • ప్రపంచంలో అత్యధిక అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగినదేశాలు: (చైనా(22,147 కి.మీ.); రష్యా(22,017 కి.మీ.); ఇండియా(15,106.7 కి.మీ.))
 • ప్రపంచంలో అతి తక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన దేశం: 
 • వాటికన్‌ సిటీ(3.2 కి.మీ.)
 • ప్రపంచంలో అతి పొడవైన ఉమ్మడి భూ సరిహద్దు కలిగిన దేశాలు: కెనగా - అమెరికా(8,893 కి.మీ.)
 • ప్రపంచంలో అతి తక్కువ ఉమ్మడి భూ సరిహద్దు కలిగిన దేశాలు: వాటికన్‌ సిటీ - ఇటలీ(3.2 కి.మీ.) 

-వి.వెంకటరెడ్డి

సీనియర్‌ ఫ్యాకల్టీ


Tags :