అమరావతి : ఎన్నికలముందు అందరికీ అమ్మఒడి అన్నారని.. అధికారంలోకి రాగానే ఒక్కరికే అంటూ మోసం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ(Devineni Uma) ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. నిబంధనల పేరుతో లక్షలమందికి కోత విధించారని విమర్శించారు. ల్యాప్ టాప్ ఆప్షన్ ఎంచుకున్న 5లక్షల మంది పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం చెయ్యాల్సిన మరుగుదొడ్ల నిర్వహణ ఖర్చు విద్యార్థుల దగ్గర వసూలు చేయడం మీ ప్రభుత్వ అసమర్థత కాదా జగన్ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.