Education-Article
బేసిక్స్‌పై పట్టుతోనే బెటర్‌ ఫలితం

మన దేశంలో మెడిసిన్‌, డెంటల్‌ కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన  ఏకైక పరీక్ష ‘నీట్‌’ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌). ఇంటర్‌ పరీక్షలు పూర్తి కావడంతో నీట్‌ రాసేందుకు సంబంధిత విద్యార్థులు అంతా ప్రిపరేషన్‌లో తలమునకలై ఉంటారనడంలో సందేహం లేదు.  వీక్‌ ఏరియాల గుర్తింపు, వాటిలో బలపడేందుకు యత్నాలు, వీక్లీ టెస్టులతో హడావిడి పడుతుంటారు. అయితే ఈ సందర్భంలో కొన్ని బేసిక్స్‌ను గుర్తించాల్సిన అవసరం ఉంది. మఖ్యంగా బేసిక్‌ నాలెడ్జ్‌ను మరింత గట్టిపర్చుకోవడం ఈ ఎగ్జామ్‌కు ఎంతైనా అవసరం.


 • దేశంలో ఏ బోర్డు పరిధిలో ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సును చదివి ఉన్నప్పటికీ నీట్‌ విషయంలో మాత్రం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలే ప్రామాణికం. అందులో కాన్సెప్టుల వివరణ అర్థవంతంగా, చాలా సులువుగా ఉంటాయి. అర్థం చేసుకోవడం స్టూడెంట్స్‌కు ఈజీ.
 • రియల్‌ లైఫ్‌ ఎగ్జాంపుల్స్‌ మరో పాయింట్‌. వీటిని బాగా తెలుసుకుంటే కాన్సెప్టులను సుదీర్ఘ కాలం గుర్తుంచుకోవచ్చు. ఇలా చేస్తే నీట్‌ ప్రిపరేషన్‌ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. 
 • బేసిక్‌ కాన్సెప్టులను అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. నిజానికి ఇది స్టూడెంట్‌ వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ప్రతీది తొందరగా నేర్చుకోవాలన్న ఆతృత ఉండకూడదు. మన స్నేహితుడు చాలా వేగంగా నేర్చుకుంటున్నాడని అనుకోరాదు. ఈ విషయంలో మరొకరితో పోలికలు అంత మంచి పద్ధతి కాదు. ఎవరికి వారు చాలా జాగ్రత్తగా ఓపికగా కాన్సెప్టులను అర్థం చేసుకోవడమే కాదు, గుర్తుంచుకునే విధంగా ఆ యత్నం ఉండాలి. 
 • టాపిక్‌ను అర్థం చేసుకోవడంలో కష్టం లేదంటే మరోరకంగా ఇబ్బంది తలెత్తితే వెంటనే ప్రశ్నించాలి. స్నేహితులు మొదలుకుని మెంటార్‌ వరకు ఎవరో ఒకరి దగ్గర సందేహాలను వ్యక్తం చేసి, వాటిని నివృత్తి చేసుకోవాలి. అర్థం కాని విషయాన్ని మనసులో అట్టిపెట్టుకోకూడదు. 
 • సొంత నోట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. చదివినదంతా రాయడం నేర్చుకోవాలి. లెర్నింగ్‌ ప్రాసెస్‌ దీంతో సులువు అవుతుంది.  నేర్చుకున్న బేసిక్‌ కాన్సెప్ట్‌లన్నింటినీ ఒక దగ్గర రాసుకుంటే, కలకాలం గుర్తుంచుకోవచ్చు. కాన్సెప్ట్‌ ఏదైనప్పటికీ అది ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకం నుంచి తీసుకున్నదే  అయి ఉండాలి. 
 • ఆన్‌లైన్‌ వీడియో ఈ రోజుల్లో అదనపు రిసోర్సు. చాలా క్లిష్టమైన కాన్సెప్టులను కూడా చిన్న బిట్లుగా విడగొట్టి, అవి లోతుగా అర్థమయ్యేందుకు వీలుగా రూపొంది ఉంటాయి. ఈ వీడియో బిట్స్‌ ఆసక్తికరంగా ఉండటమే కాదు, సులువుగా నేర్చుకునేందుకు ఉపయోగపడతాయి.


మంచి స్కోర్‌ సాధించాలంటే?

టెస్ట్‌ ఏదైనప్పటికీ, అందులో మంచి స్కోర్‌ సాధించలేకపోవడానికి కారణాలు అనేకం. టైమ్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాల లేమి, ఆత్మవిశ్వాసం కొరవడటం, కాన్సెప్ట్‌లను అర్థం చేసుకునే సామర్థ్యం లేకపోవడం సహా అనేక కారణాలు తోడవుతూ ఉంటాయి. 

 • సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ చాలా ముఖ్యం. బలాలు, బలహీనతలు అందులోనే వెల్లడి అవుతాయి. దాన్నే స్కోర్‌ పెంపునకు ఉపయోగించుకోవచ్చు. ఒక మాక్‌ టెస్ట్‌ పూర్తయిన వెంటనే, దాన్ని ఆసాంతం లోతుగా పరిశీలించాలి. దొర్లిన మిస్టేక్స్‌ను నోట్‌ చేసుకోవాలి. రైట్‌ ఆన్సర్‌తో పోల్చుకోవాలి. ఆ క్రమంలో తప్పు ఎక్కడ జరిగిందన్నది నిక్కచ్చిగా తేల్చుకోవాలి. అదే అసె్‌సమెంట్‌ ఏ ఏరియాలో బలహీనంగా ఉన్నారో తెలియజేస్తుంది. సరిగ్గా గుర్తించగలిగితే మరింత కష్టపడి, అందులో మెరుగు కావచ్చు. 
 • పదేపదే ప్రాక్టీస్‌ కూడా అవసరమే. నీట్‌ ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల పేపర్లను తీసుకుని సాల్వ్‌ చేయాలి. ఆప్పుడే ప్రశ్నల సరళి అర్థమవుతుంది. ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, ఎలా అడుగుతున్నారు, ట్విస్టులు ఏమైనా ఉన్నాయా వంటివి తేలుతాయి.  పదే పదే అడుగుతున్న ఏరియాలు, లేదంటే మార్చి ఇస్తున్న ప్రశ్నలు ఏవో కూడా తెలుస్తాయి.
 • టైమ్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ అంటే సమయపాలన అన్నది మరో ముఖ్యమైన పాయింట్‌. మాక్‌ టెస్ట్‌ అయినప్పటికీ, పరీక్షలో మాదిరిగా టైమ్‌ పెట్టుకుని చేయాలి.  మాక్‌ టెస్ట్‌ రాసిన ప్రతిపర్యాయం ఇదే పద్ధతిని అనుసరిస్తే, సమాధానాల గుర్తింపులో వేగం పెరుగుతుంది. అలాగే ఏ సబ్జెక్టుతో మొదలుపెడితే సమయం కలిసి వస్తుంది, ఎక్కడ ఆగుతున్నాం, ఎక్కడ వృథా అవుతోంది కూడా తెలుస్తుంది. అలా ఎప్పటికప్పుడు మన వ్యూహం మార్చుకోడానికి, చివరగా పరీక్షకు అనుగుణంగా సన్నద్ధమయ్యేందుకు దోహదపడుతుంది. 
 • మాక్‌ టెస్టులకు ముందే కోర్‌ కాన్సెప్టులను అర్థం చేసుకోవడం చాలా అవసరం. సిలబ్‌సపై బేసిక్‌ నాలెడ్జ్‌ లేకుండా మాక్‌ టెస్టులు రాస్తే, సమాధానాలను తప్పుగా గుర్తించే ప్రమాదం ఉంటుంది.  
 • ఫోక్‌స్డగా ఉండాలి. అది మాక్‌ టెస్ట్‌ అయినప్పటికీ అసలు పరీక్ష అన్నంత సీరియ్‌సగా అటెంప్ట్‌ చేయాలి. కామ్‌గా ఉండాలి. ఒత్తిడికి లోనైతే రైట్‌ సమాధానాలు కూడా ఆ సమయంలో గుర్తుకు రావు. 

టైమ్‌టేబుల్‌

 • నిర్దేశించుకున్న స్టడీ టైమ్‌టేబుల్‌కు కట్టుబడి ఉండాలి. వ్యూహాత్మక టైమ్‌ టేబుల్‌ చాలా అవసరం. అదే సమయంలో దానికి అనుగుణంగా స్డడీని కొనసాగించడం చాలా ముఖ్యం. ఫలానా రోజు లేదా సమయానికి పూర్తి కావాలి అనుకుంటే అప్పటికి అయిపోవాలి, అంతే.
 • కంటిన్యూ్‌సగా ఎన్నడూ చదవొద్దు. మధ్యమధ్యలో పది నుంచి పదిహేను నిమిషాలు బ్రేక్‌ తీసుకోవచ్చు. కష్టం నుంచి సులువైన సబ్జెక్టులు ప్రాతిపదికన చదవండి. ఇష్టం లేనివి, తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినవి రోజూ చదవండి. విసుగు తెప్పిస్తుంటే, సరికొత్త పద్ధతుల్లో నేర్చుకునే మార్గం చూసుకోండి. ఉదాహరణకు బ్రేక్‌ఫాస్ట్‌  అలాగే భోజనం  చేసే టేబుల్‌ దగ్గర ఒకామె కొన్ని చార్టులు అతికించుకుని అవి చూస్తూ తినేదట. మరొకతను ఒక క్లిష్టమైన ప్రాబ్లెమ్‌ను సాల్వ్‌ చేసిన తరవాతే టెన్నిస్‌ ఆటకు వెళ్ళేవాడట. సరిగ్గా ఇదనే కాదు, మీకు నచ్చిన విధంగా కొన్ని క్లిష్టమైన అంశాలకు మీవైన వ్యూహాలు అమలుచేసుకోండి. దేనికీ నిర్ధుష్ట పద్ధతులు అంటూ ఉండవు. ఎవరి వెసులుబాటు వారిదే.
 • సెల్‌ వంటి ఎలక్ట్రానిక్‌ గాడ్జట్స్‌కు దూరంగా ఉండండి. అవసరం అనుకుంటే బ్రేక్‌ సమయంలో వాటి పనిపట్టండి. అప్పటివరకు వాటిని చాలా దూరంగా పెట్టుకోండి. కొంతమంది సెల్‌లో గేమ్స్‌ ఆడటానికి అలవాటుపడ్డారనే అనుకుందాం. బ్రేక్‌లో ఆ పని కానివ్వండి. ఫలానాది వస్తేనే ఆట అనే నియమం పెట్టుకోండి. అది పక్కాగా అమలు చేయండి. 
 • ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు దాన్ని ఆటంకపరిచే అన్నింటికీ దూరంగా ఉండాలి. మన దృష్టి కోణాన్ని పక్కకు తప్పించే దేనికీ ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఈ కొద్ది రోజులు నీట్‌ తప్ప మరొకటి మీ దృష్టిలోకి రాకుండా చూసుకోండి. 
 • మెడిటేషన్‌ చాలా మంచిది. ఫిజికల్‌, మెంటల్‌ హెల్త్‌ రెంటికీ అది మంచిదన్నది అనుభవజ్ఞుల మాట. మెడిటేషన్‌తో మైండ్‌ ప్రశాంతంగా ఉంటుంది. కాన్సంట్రేషన్‌ లెవెల్స్‌ పెరుగుతాయి. కొద్ది రోజలు మెడిటేషన్‌ చేయండి. అందులో లాభం ఉందో లేదో మీకే తెలుస్తుంది. పర్సనల్‌ అనుభవం, అనుభూతికి మించిది మరొకటి లేదు. నీట్‌ పరీక్ష ఒక్కసారి పూర్తి చేశారంటే చాలు, కొంతకాలం పూర్తిగా రిలాక్స్‌ కావచ్చు. కష్టపడితేనే రిలాక్స్‌ అయ్యేందుకు వీలు ఉంటుంది. ఒకదానికి మరొకటిగా పెనవేసుకున్న ఈ రెండు సూత్రాలను జాగ్రత్తగా అర్థం చేసుకుని ముందుకు నడవండి. విజయం దానంత అదే మీ చెంతకు వస్తుంది.


ఒక మాక్‌ టెస్ట్‌ పూర్తయిన వెంటనే, దాన్ని ఆసాంతం లోతుగా పరిశీలించాలి. దొర్లిన మిస్టేక్స్‌ను నోట్‌ చేసుకోవాలి. రైట్‌ ఆన్సర్‌తో పోల్చుకోవాలి. 


రిపీటర్లకు సూచనలు

 • టైమ్‌ మేనేజ్‌మెంట్‌ మీ ప్రిపరేషన్‌లో అతి ముఖ్యమైన పాయింట్‌. రైట్‌ జవాబులను నిర్దేశిత సమయంలోపే పొందే సామర్థ్యాన్ని గడించాలి. ప్రతి మాక్‌ టెస్ట్‌కు టైమ్‌ సెట్‌ చేసుకుని మరీ రాయాలి. అప్పుడే సమయపాలన బాగా అర్థమవుతుంది. 
 • కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇచ్చిన మెటీరియల్‌, నోట్స్‌కే పరిమితం కావద్దు. ఇంటర్నెట్‌లో చెక్‌ చేయండి. వేర్వేరు ఆన్‌లైన్‌ వేదికల నుంచి మరింత మెటీరియల్‌ని సేకరించండి. ఇంటర్నెట్‌లో లభించే సమాచారంలో ఎక్కువ మేర ఉచితం. వీటినీ ఉపయోగించుకుని నాలెడ్జ్‌ లేదంటే అవగాహనను మరింత పెంచుకోండి. 
 • చక్కటి ప్రిపరేషన్‌ ప్లాన్‌ను రూపొందించుకోండి. యూట్యూబ్‌లో టాపర్ల వీడియోలు ఈ రోజు  అనేకం లభ్యమవుతున్నాయి. అవి చూస్తే, వాళ్ళ వ్యూహాలు అర్థమవుతాయి. మీ నాలెడ్జ్‌కు తగ్గట్టు మీదైన వ్యూహాన్ని రచించుకోండి. ఆ ప్లాన్‌ చాలా ఎఫెక్టివ్‌గా ఉండేలా చూసుకోవడమే కాదు, అమలు చేయండి. 
 • కోచింగ్‌ సెంటర్లో చేరడమే మంచిది. మనకు ఏదైనా సందేహం కలిగితే, వివరించి చెప్పే ట్యూటర్లు అక్కడ ఉంటారు. నిజానికి అది మనకు భరోసా కలిగిస్తుంది. అనుభవజ్ఞులతో ఎప్పటికీ లాభమే తప్ప నష్టం ఉండదు. రెడిరెకనర్‌గా వాళ్ళంతా ఉపయోగపడతారు. ఒంటరిగా కూర్చుంటే డీవియేషన్స్‌కు అవకాశం ఉంటుంది. పదిమందిలో అందునా ఒకే లక్ష్యంతో ప్రిపేరవుతున్న వాళ్ళ మధ్య ఉంటే కాన్ఫిడెన్స్‌ పెరుగుతుంది. మొదట స్టడీ భారంగా అనిపించదు. అది మరింత పాజిటివిటీకి దారితీస్తుంది.
 • రిపీటర్లు అయినందున ప్రశ్నలు అడగకూడదని, సందేహలు తలెత్తకూడదన్న రూలేమీ లేదు. ఎప్పుడైనా ఎవరికైనా సందేహం రావచ్చు. అడిగి, సమాధానం తెలుసుకోవడమే మంచి పద్ధతి. క్లాస్‌కు ముందు, తదుపరి ప్రశ్నలు అడిగే అవకాశం ఎప్పటికీ ఉంటుంది, ఉంచుకోవాలి.
Tags :