Education-Article
ఆ కాలేజీల ముందు ధర్నా చేయండి.. అవాక్కయిన విద్యార్థి నేతలు

నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై బొత్స వ్యాఖ్యలు

అవాక్కయిన విద్యార్థి నేతలు


అమరావతి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): కళాశాలల ఫీజుల వ్యవహారంపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాలేజీ ఫీజులపై తనను కలిసిన విద్యార్థి నాయకులకు నారాయణ, శ్రీచైతన్య కాలేజీల ఎదుట ధర్నా చేయాలని సలహా ఇచ్చారు. అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎ్‌సఎఫ్‌) ప్రతినిధులు మంగళవారం తాడేపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద మంత్రిని కలిశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే నారాయణ, శ్రీచైతన్య కాలేజీలు అక్రమ అడ్మిషన్ల పేరుతో దోపిడీ చేస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. దానిపై మంత్రి స్పందిస్తూ... ‘ఒక పని చేస్తావా. సీరియ్‌సగా చెబుతున్నా. రేపు వెళ్లి చైతన్య, నారాయణ కాలేజీల ముందు ధర్నా చెయ్‌’ అని వారితో అన్నారు. ఆయన వ్యాఖ్యలపై విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. ప్రైవేటు కాలేజీల్లో దోపిడీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అడుగుతుంటే, తమనే వెళ్లి ధర్నా చేయమనడం ఏమిటని ప్రశ్నించారు.

Tags :