Education-Article
‘సింగరేణి’లో Junior Assistant Posts

కొత్తగూడెం(Kottagudem)లోని సింగరేణి(Singareni) కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌... ఎక్స్‌టర్నల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-2) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అర్హతలు: డిగ్రీతోపాటు కంప్యూటర్స్‌, ఐటీ ఒక సబ్జెక్టుగా చదివినవారు; ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై కంప్యూటర్స్‌లో డిగ్రీ, డిప్లొమా లేదా ఆరు నెలల సర్టిఫికెట్‌ కోర్సు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. 

రిజర్వేషన్‌: రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం ఉద్యోగాలను స్థానిక(ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల) అభ్యర్థులతో, మిగిలిన 5 శాతం పోస్టులను అన్‌రిజర్వుడ్‌ కోటా కింద(తెలంగాణలోని అన్ని జిల్లాల వారితో) భర్తీ చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: జూన్‌ 20

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 10

వెబ్‌సైట్‌: https://scclmines.com/scclnew/-index.asp

Tags :