Education-Article
దరఖాస్తు గడువు పొడిగించేది లేదు

పోలీస్‌ కొలువులకు 4.50 లక్షల అప్లికేషన్లు

టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌ శ్రీనివాసరావు


హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ కొలువుల(Police scales) కోసం దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించబోమని పోలీస్‌ నియామక మండలి బోర్డు(Police Recruitment Board Board) (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ నెల 20 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. చివరి రోజుల్లో సర్వర్‌ డౌన్‌(Server down) అయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల వీలైనంత త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. మరోవైపు, పోలీస్‌ పోస్టులకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. గత 11 రోజుల్లో 2.50 లక్షల మంది అభ్యర్థులు.. 4.50 లక్షల దరఖాస్తులు దాఖలు చేశారు. ఇందులో లక్ష వరకు మహిళా అభ్యర్థులు ఉన్నాయి. 

Tags :