హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : కరోనా సమయంలో నర్సుల సేవలు వెల్లకట్టలేనివని ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు (Health Minister) అన్నారు. ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా గాంధీ మెడికల్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హరీశ్ (Harishrao) మాట్లాడుతూ త్వరలో 4,722 నర్సింగ్ ఉద్యోగాలకు (Nursing) నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం తెలంగాణలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సీనియర్ నర్సులకు ప్రశంసాపత్రాలను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ, డీఎంఈ డాక్టర్ రమే్‌షరెడ్డి, డీఎంఓ శ్రీనివాస్, గాంధీ, ఉస్మానియా సూపరింటెండెంట్లు ప్రొఫెసర్ రాజారావు, నాగేందర్ పాల్గొన్నారు.
ఎన్టీఆర్ గొప్పవాడు..
ఎన్టీరామారావు (NT Ramarao) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎల్వీ ప్రసాద్ (LV Prasad) ఆస్పత్రికి స్థలం ఇచ్చారని, ఆయన నిజంగా గొప్పవాడని మంత్రి హరీశ్‌రావు (Minister Harish) అన్నారు. ఎన్టీఆర్ స్థలం ఇవ్వబట్టే ఆసియాలోనే నెంబర్‌వన్ ఆస్పత్రి తెలంగాణలో ఏర్పడిందన్నారు. ఎల్వీప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలకు వెళ్లి కంటి పరీక్షలు నిర్వహించేందుకు కోటీ 35 లక్షలతో తయారుచేసిన ప్రత్యేక వాహనాన్ని గండిపేట మండలం కిస్మత్పూర్ గ్రామంలో హరీశ్‌రావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆస్పత్రి అధినేత డాక్టర్ జీఎన్. రావు, ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్ తదితరులు పాల్గొన్నారు.