Education-Article
నీటి పారుదలశాఖలో త్వరలోనే 1583 పోస్టుల భర్తీ!

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు


హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదల శాఖ(Department of Irrigation)లో 1583 ఉద్యోగాలను భర్తీకి అనుమతి కోరుతూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇందులో 704 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఏఈఈ-ఎలక్ట్రికల్‌, సివిల్‌, మెకానికల్‌, అగ్రికల్చర్‌) పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ(Ministry of Finance) ఆమోదం తెలుపగా... స్కిల్డ్‌ కేటగిరీలో 879 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఆమోదముద్ర పడనుంది. స్కిల్డ్‌ కేటగిరీలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, ఎలక్ట్రిషీయన్‌, ఫిట్టర్‌, ఫ్లడ్‌ గేట్‌ ఆపరేటర్‌, జనరేటర్‌ ఆపరేటర్‌, పంప్‌ ఆపరేటర్‌, వైర్‌లెస్‌ ఆపరేటర్‌ వంటి పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల భర్తీ ప్రక్రియ అంతా తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ద్వారానే జరగనుంది. ఏఈఈ పోస్టులకు బీటెక్‌(ఎలక్ట్రికల్‌, సివిల్‌, మెకానికల్‌, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌) పట్టభద్రులు అర్హులు కాగా... స్కిల్డ్‌ ఉద్యోగాలకు ఆయా విభాగాల్లో ఐటీఐ/పాలిటెక్నిక్‌ పూర్తిచేసిన వారు అర్హులు. 

Tags :