చీరాలటౌన్, మే 12: బాపట్ల జిల్లా(Bapatla District) చీరాల మండల పరిధిలోని ఈపూరుపాలెంలో ఇంటర్ ఓపెన్ పరీక్ష(inter open exams)ల్లో మాస్ కాపీయింగ్‌కు సహకరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ ఓఎస్ఎస్ పరీక్షల్లో.. గురువారం హిస్టరీ, మ్యాథ్స్ పరీక్ష జరుగుతున్న సమయంలో పాఠశాల సమీపంలో ఈపూరుపాలెంనకు చెందిన కోటేశ్వరరావు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించి, అతను మాస్ కాపీయింగ్‌కు సహకరిస్తున్నట్లు గుర్తించారు. ప్రశ్నలకు జవాబులు తయారుచేసి లోపలికి అందజేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. నిందితుడి వద్ద ల్యాప్‌టాప్, ప్రింటర్, కొన్ని జవాబుల స్లిప్‌లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.