ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి(Andhra Pradesh State Higher Education Council) (ఏపీఎస్సీహెచ్ఈ) - పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీ ఈసెట్) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ( Sri Venkateswara University) (ఎస్వీయూ) నిర్వహిస్తోంది. ఈ టెస్ట్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంటెక్/ ఎంఫార్మసీ/ ఫార్మాడీ (పీబీ)ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇంజనీరింగ్/ ఫార్మసీ కాలేజీల్లో అడ్మిషన్స్ ఇస్తారు. సీట్ల భర్తీలో గేట్/ జీప్యాట్ వ్యాలిడ్ స్కోర్ ఉన్న అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. తరవాతనే ఏపీపీజీఈసెట్ 2022 స్కోర్ సాధించిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
విభాగాలు: కెమికల్, అగ్రికల్చరల్, ఏరోనాటికల్, అప్లయిడ్ పెట్రోలియం, ఆర్కిటెక్చరల్, ఏరోస్పేస్, ఆటొమొబైల్, బయో కెమికల్, బయోఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ, బయోమెడికల్, సివిల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, సివిల్ ఎన్విరాన్మెంటల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్, డెయిరీ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీమాటిక్స్, ఫుడ్ సైన్స్/ ఇంజనీరింగ్/ టెక్నాలజీ, జియోఇన్ఫర్మాటిక్స్, జియోసైన్స్, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ఇంజనీరింగ్, మెకట్రానిక్స్, మెకానికల్, మెటలర్జీ, మైనింగ్, మెకానికల్ మెరైన్, నేవల్ ఆర్కిటెక్చర్, పెట్రోలియం ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ, ఫార్మసీ, వెటర్నరి సైన్స్, డెంటల్, అప్లయిడ్ కెమిస్ట్రీ, అప్లయిడ్ ఫిజిక్స్, అప్లయిడ్ మేథమెటిక్స్, టెలీ కమ్యూనికేషన్, అప్లయిడ్ స్టాటిస్టిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పవర్ ఇంజనీరింగ్, మైక్రో బయాలజీ, లైఫ్ సైన్సెస్.
అర్హత
- ఏఐసీటీఈ/ యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఇంజనీరింగ్/ ఫార్మసీ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
- ఎంటెక్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ/ బీటెక్/ బీఆర్క్/ ఏఎంఐఈ + డిప్లొమా/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణులు అప్లయ్ చేసుకోవచ్చు.
- ఎంఫార్మసీ/ఫార్మాడీ(పీబీ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి బీఫార్మసీ/ బీడీఎస్/ ఎమ్మెస్సీ/ ఎంబీబీఎస్ పూర్తిచేసినవారు అప్లయ్ చేసుకోవచ్చు.
- పీజీ ఈసెట్ రాయడానికి నిర్దేశించిన ఇతర అర్హత కోర్సుల వివరాలు, విభాగానికి ప్రత్యేకించిన ఏపీ పీజీ ఈసెట్ టెస్ట్ పేపర్ల వివరాలు, సిలబస్ కోసం వెబ్సైట్ చూడవచ్చు.
ఏపీ పీజీ ఈసెట్ 2022 వివరాలు: ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. విభాగానికి నిర్దేశించిన ప్రకారం సంబంధిత స్పెషలైజేషన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 120. పరీక్ష సమయం రెండు గంటలు. ఈ టెస్ట్‌లో అర్హత సాధించాలంటే కనీసం 30 మార్కులు(25 శాతం) రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నిబంధన వర్తించదు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1200; బీసీ అభ్యర్థులకు రూ.900; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.700
చివరి తేదీ: జూన్ 14
ఆన్లైన్ దరఖాస్తులో కరెక్షన్స్: జూన్ 28 నుంచి జూలై 2 వరకు
హాల్ టికెట్స్ డౌన్లోడింగ్: జూలై 9 నుంచి
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, గూడూరు, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, నర్సరావుపేట, విజయవాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, భీమవరం, కడప
ఏపీ పీజీ ఈసెట్ 2022 తేదీలు: జూలై 18 నుంచి 20 వరకు
ప్రిలిమినరీ ‘కీ’ విడుదల: జూలై 19 నుంచి 21 వరకు
వెబ్సైట్: cets.apsche.ap.gov.in