Education-Article
IRCONలో 16 ఖాళీలు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌...వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ఫైనాన్స్‌ అసిస్టెంట్‌-08; హెచ్‌ఆర్‌ అసిస్టెంట్‌-05; ఐటీ ఇన్‌చార్జ్‌-03

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, పీజీ డిగ్రీ/డిప్లొమా, సీఏ/సీఎంఏ ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 2022 ఏప్రిల్‌ 01 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 09

దరఖాస్తు హార్డ్‌ కాపీలను పంపడానికి చివరి తేదీ: మే 16   

వెబ్‌సైట్‌: https://www.ircon.org/

Tags :