Education-Article
గ్రూపు-1లో తెలుగును అర్హత పేపరుగా చేర్చాలి

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు అభ్యర్థుల వినతి

టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూపు-1 మెయిన్స్‌లో తెలుగు భాష పేపరును అర్హత పరీక్షగా ప్రవేశపెట్టాలని అభ్యర్థులు కోరారు. ఈ మేరకు గురువారం మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ను కలిపి వినతి పత్రం సమర్పించారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఇంగ్లీషు పరీక్షలో అర్హత సాధించడానికి అదనంగా కష్టపడాల్సి వస్తోందని పేర్కొన్నారు. తెలుగును అర్హత పరీక్షగా ప్రవేశపెడితే.. గ్రామీణ, పట్టణ ప్రాంత అభ్యర్థులకు సమాన అవకాశం కల్పించినట్టవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ భాష పేపరును మెయిన్స్‌లో అర్హత పరీక్షగా పరిగణించాలని కోరారు. 

Tags :