Education-Article
ఆశ్రమ పాఠశాలలుగా సంక్షేమ హాస్టళ్లు

అప్‌గ్రేడ్‌ చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు 

హైదరాబాద్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఉండి వేర్వేరు విద్యా సంస్థల్లో చదువుకుంటున్న గిరిజన విద్యార్ధుల కష్టాలు తీర్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్ని ఆశ్రమ పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయనుంది. ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా ప్రధాన కార్యాలయ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. భవనాలు, బోధనా సిబ్బంది, ఇతర మౌలిక సదుపాయాలున్న సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన వివరాలు అందజేయాలని అన్ని జిల్లాల అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు పంపించారు. 

Tags :