హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కాలేజీకి జాతీయ మదింపు, గుర్తింపు మండలి (న్యాక్) నుంచి గుర్తింపు లభించింది. ఈ కాలేజీకి ‘ఏ ప్లస్’ గ్రేడ్ గుర్తింపు ఇస్తున్నట్టు న్యాక్ అధికారులు మెయిల్ ద్వారా ఆ కళాశాలకు తెలియజేశారు. ఈ గుర్తింపు మంగళవారం నుంచి వచ్చే 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని కాలేజీ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.