Education-Article
వ్యవసాయ వర్సిటీ-అగ్రి బయోటెక్‌ ఒప్పందం

రాజేంద్రనగర్‌, జనవరి25(ఆంధ్రజ్యోతి): విద్య, పరిశోధన రంగాలలో కలిసి పనిచేయాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, అగ్రి బయోటెక్‌ ఫౌండేషన్‌ల మధ్య మంగళవారం ఓ అవగాహన ఒప్పందం కుదిరింది. వర్సిటీ ఉపకులపతి వి.ప్రవీణ్‌రావు సమక్షంలో రిజిస్ట్రార్‌ ఎస్‌.సుధీర్‌ కుమార్‌, అగ్రి బయోటెక్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ డి.విష్ణువర్ధన్‌రెడ్డి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. 

Tags :