Education-Article
డిజిటల్‌ క్లాసులకు 63% మంది విద్యార్థులు

హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు కొనసాగుతున్న డిజిటల్‌ క్లాసులకు మంగళవారం 63% మంది విద్యార్థులు హాజరయినట్టు అధికారులు ప్రకటించారు. విద్యాసంస్థలకు సెలవులు పొడిగించడంతో సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు డిజిటల్‌ బోధన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మూడు తరగతుల్లో మొత్తం 7,19,385 మంది విద్యార్థులు ఉన్నారని అధికారులు తెలిపారు. మంగళవారం 4,55,912 మంది విద్యార్థులు డిజిటల్‌ క్లాసులు విన్నారన్నారు. కాగా, సుమారు 36,440 మంది విద్యార్థులకు పాఠాలు వినడానికి ఎలాంటి సౌకర్యమూ అందుబాటులో లేదని చెప్పారు.

Tags :