Education-Article
గెస్ట్‌ లెక్చరర్ల నియామకానికి ఓకే

జూనియర్‌ కాలేజీల్లో వెయ్యి మందికి అవకాశం

అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో వెయ్యి మంది గెస్ట్‌ లెక్చరర్ల నియామకానికి విద్యాశాఖ ఓకే చెప్పింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నియామకాల ప్రక్రియను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు చేపడతారు. రెగ్యులర్‌ అధ్యాపకులు తక్కువుగా ఉన్న చోట ఇలా గెస్ట్‌ లెక్చరర్లను తీసుకుంటారు. వీరికి గంటకు రూ.150 చొప్పున చెల్లిస్తారు. అలా నెల మొత్తానికి రూ.10వేలకు మించకుండా జీతం ఇచ్చేలా నిబంధనలు ఉన్నాయి. అయితే ఇప్పటికే చాలా కాలం నుంచి గెస్ట్‌ లెక్చరర్లు ఇంటర్‌ కళాశాలల్లో పనిచేస్తున్నారు. సాధారణంగా వారే తిరిగి దరఖాస్తు చేసుకోవడం, లేదంటే వారినే రెన్యువల్‌ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కడైనా కొంతమంది మానేసినా, లేకుంటే కొత్త అవకాశాలున్నా ఆ స్థానాల్లో కొత్త వారిని తీసుకుంటారు.

Tags :